తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్ విభాగంలో 7 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగంలో 17 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ విభాగంలో 8 పోస్టులను భర్తీ చేయనుంది. సెప్టెంబరు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అక్టోబరు 10తో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబరు 19 నుంచి అందుబాటులో ఉండనుంది. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 32
పోస్టుల వారీగా ఖాళీలు:
1. సైంటిఫిక్ ఆఫీసర్ (డీఎన్ఏ): 02
2. సైంటిఫిక్ అసిస్టెంట్ (డీఎన్ఏ): 04
3. ల్యాబ్ అసిస్టెంట్ (డీఎన్ఏ): 02
4. సైంటిఫిక్ ఆఫీసర్ (బయోలజీ డివిజన్): 03
5. సైంటిఫిక్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్): 03
6. ల్యాబ్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్): 04
7. సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్): 02
8. సైంటిఫిక్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్): 06
9. ల్యాబ్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్): 02
10. సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్ డివిజన్): 04
దరఖాస్తు విధానం: అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, సంబంధిత చిరునామాకు నిర్ణీత తేదీలోగా చేరేలా పంపాలి. లేదా నేరుగా కూడా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.09.2022
* దరఖాస్తు చివరి తేది: 09.10.2022.
చిరునామా: Director, TSFSL,
Red Hills, Nampally,
Hyderabad- 500004.
సంప్రదించాల్సి ఫోన్ నెంబర్లు: 040-29394449, 040-23307138.
ఈమెయిల్: itcellfsl@gmail.com
Also Read
తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read
ఈవో పోస్టుల దరఖాస్తు ప్రక్రియ షురూ, మహిళలు మాత్రమే అర్హులు!
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 విస్తరణాధికారుల (సూపర్‌వైజర్) గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సరైన అర్హతలు ఉన్న మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 29న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక లింక్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు మొదటగా తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నిర్దారించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...