తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గురుకుల నియామకాల్లో భాగంగా డిగ్రీ లెక్చరర్స్‌ (డీఎల్‌), జూనియర్‌ లెక్చరర్స్‌ (జేఎల్‌), ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టుల పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 17న తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌) విడుదల చేయనుంది. జోనల్‌, మల్టీ జోనల్‌ వారీగా ఉన్న పోస్టుల వివరాలతోపాటు నిర్దేశిత విద్యార్హతల వివరాలను, ఎగ్జామ్‌ సిలబస్‌ తదితర అంశాలను ప్రకటించనుంది. ఈ పోస్టుల వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ 12 నుంచి ప్రారంభంకాగా, ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.


Website


ఆగస్టులో పరీక్షల నిర్వహణ..
గురుకులాల్లో పోస్టుల భర్తీకి ట్రిబ్‌ పకడ్బందీ చర్యలు చేపట్టింది. పరీక్ష నిర్వహణకు సమగ్ర ప్రణాళికలను రూపొందించేందుకు తలమునకలైంది. ఇప్పటికే రోస్టర్‌ ప్రాతిపదికన పోస్టుల రిజర్వ్‌ ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం నోటిఫికేషన్లను కూడా ప్రణాళికాబద్ధంగా విడుదల చేస్తున్నది. తొలుత డిగ్రీ, జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ పోస్టులు, ఆ తరువాత పీజీటీ, పీడీ, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, టీజీటీ పోస్టుల భర్తీకి ప్రణాళికలను రూపొందించింది. అంతేకాదు, ఆయా పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపైనా కూడా ట్రిబ్‌ ముమ్మర సన్నాహలు చేస్తున్నది. దరఖాస్తుల స్వీకరణ ముగిసినప్పటి నుంచి రెండు నెలల సమయమివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం మీద ఆగస్టు నుంచి పరీక్షల నిర్వహణకు ట్రిబ్‌ దృష్టిసారించింది.


తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేశారు. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.


గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17  నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.


తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2008 ఖాళీలు


తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు


ఇతర పోస్టుల వివరాలు ఇలా..


➥ తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!


➥ తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు


➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు


➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు


➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 134 ఆర్ట్ టీచర్ పోస్టులు


➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు


➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు


Also Read:


సీజీఎల్ఈ-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, ఈ సారి 7500 వరకు ఖాళీల భర్తీ - దరఖాస్తు ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2023' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...