Gurukula Results: గురుకుల పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల ఫలితాలు వెల్లడి

తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల ఫలితాలను గురుకుల నియామక బోర్డు ఫిబ్రవరి 13న వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది.

Continues below advertisement

Gurukula Results: తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల ఫలితాలను గురుకుల నియామకాల సంస్థ ఫిబ్రవరి 13న వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది. అనివార్యకారణాల వల్ల కొందరి ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం 1-2 రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీచేయనుంది.

Continues below advertisement

గురుకుల నియామక సంస్థ వెల్లడించిన ఫలితాల్లో పీజీటీ- మ్యాథమెటిక్స్, బయాలజీ, హిందీ, తెలుగు, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ పోస్టులు; పాఠశాల, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు; పాఠశాల, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఉన్నాయి..

గురుకుల నియామక సంస్థ వెల్లడించిన ఫలితాల్లో పీజీటీ- మ్యాథమెటిక్స్ (206, పెండింగ్-16), బయాలజీ (149, పెండింగ్-9), హిందీ (161, పెండింగ్-5), తెలుగు (177, పెండింగ్-6), సోషల్ స్టడీస్ (194, పెండింగ్-6), ఇంగ్లిష్ (181, పెండింగ్-6), ఫిజికల్ సైన్స్ (135, పెండింగ్-4); డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ (25), జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ (34), పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ (271, పెండింగ్-4); డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్(35), జూనియర్ కాలేజీ లైబ్రేరియన్ (48), పాఠశాల లైబ్రేరియన్ (381, పెండింగ్-37) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఉన్నాయి.

పీజీటీ పోస్టులకు 1203 మంది అభ్యర్థులు ఎంపికవగా.. పలు కారణాల వల్ల 58 మంది ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. అలాగే డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, పాఠశాల స్థాయిలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 330 మంది ఎంపికయ్యారు. నలుగురి ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, పాఠశాల స్థాయిలో లైబ్రేరియన్ పోస్టులకు 464 మంది ఎంపికవగా.. 37 మంది ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

 Provisional selection list of Post Graduate Teacher in Mathematics

 Provisional selection list of Post Graduate Teacher in Biology

Provisional selection list of Post Graduate Teacher in Hindi

Provisional selection list of Post Graduate Teacher in Telugu

Provisional selection list of Post Graduate Teacher in Social

Provisional selection list of Post Graduate Teacher in English

Provisional selection list of Post Graduate Teacher in Physical Science

Provisional selection list of Physical Director in Degree College

Provisional selection list of Physical Director in Junior College

Provisional selection list of Physical Director in School

Provisional selection list of Librarian in Degree College

Provisional selection list of Librarian in Junior College

Provisional selection list of Librarian in School

ALSO READ:

పేపర్‌ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదు!
జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న ఇందుకు సంబంధించిన 'పబ్లిక్‌ పరీక్షల అక్రమ మార్గాల నిరోధక బిల్లు-2024' పేరుతో  బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఇటీవల ఆమోదం తెలపగా... రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దీంతో ఫిబ్రవరి 13న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement