Gurukula Recruitment Result: తెలంగాణలోని సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో 2,144 పోస్టులకు 1 : 2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు గురువారం (ఫిబ్రవరి 8) రాత్రి ప్రకటించింది. సర్టిఫికేట్ల పరిశీలన వీలుగా ఆయా విద్యాలయాల్లో ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌లు కలిపి 868 పోస్టులకు బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. ఇక 1,276 పీజీటీ పోస్టుల జాబితాలు గురువారం (ఫిబ్రవరి 8) విడుదల చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీగా కేటగిరీ వారీగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు పూర్తిచేసింది. వారం రోజుల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) మినహా మిగతా వాటికి ఫలితాలు వెల్లడి కానున్నాయి.


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఈ సర్టిఫికేట్లు అవసరం.. 


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


* జూనియర్ కాలేజీ లైబ్రేరియన్, డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్, జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫిబ్రవరి 9న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్నిరకాల ధ్రువపత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.


సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 09.02.2024.


సమయం: ఉదయం 9 గంటల నుండి.


వేదిక: Telangana Social Welfare Residential Law College for Women, 
        Chaithanyapuri, Opp. Metro Pillar No. 1570, 
         L.B.Nagar, Ranga Reddy District.   


* స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫిబ్రవరి 9న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్నిరకాల ధ్రువపత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.


సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ: 09.02.2024/ 10.02.2024.


సమయం: ఉదయం 9 గంటల నుండి.


వేదిక: Telangana Social Welfare Residential Law College for Women, 
        Chaithanyapuri, Opp. Metro Pillar No. 1570, 
         L.B.Nagar, Ranga Reddy District.   



డెమో తరగతులకు ఏర్పాట్లు...
ఫలితాలు ప్రకటించిన పోస్టుల్లో డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పీడీ, లైబ్రేరియన్, పాఠశాలల్లో పీడీ పోస్టులకు డెమో తరగతులు తప్పనిసరి. మాసబ్ ట్యాంక్ సంక్షేమభవన్ ఆవరణలో ఆ తరగతుల నిర్వహణకు సంక్షేమ శాఖలు అవసరమైన సదుపాయాలు కల్పించాయి. డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పోస్టులకు 10, 11 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డెమో తరగతులు పూర్తయిన తర్వాత ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కిందిస్థాయి పోస్టుల వరకు ప్రాధాన్యత క్రమంలో తుది ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. తద్వారా గురుకులాల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలకు అవకాశం లేకుండా చేయాలనేది బోర్డు లక్ష్యమని సంబంధిత వర్గాలు తెలిపాయి.


రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి తొమ్మిది క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.


గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17  నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 1 నుంచి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడుషిప్టుల చొప్పున రాతపరీక్షల్ని గురుకుల నియామకబోర్డు నిర్వహించింది. వీటికి సగటున 75.68 శాతం మంది హాజరయ్యారు. ఆయా పోస్టులకు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,93,727 మంది పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఆప్షన్ల ఆధారంగా ఆయా పోస్టుల వారీగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేస్తుంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...