Jagaddhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో నా ఇల్లు నా ఇష్టం నాకు నచ్చినట్లుగా చేసుకుంటాను అంటుంది నిషిక.


ధాత్రి: ఆమె చెంప పగలగొడుతుంది. దాంతో అందరూ అక్కడికి వస్తారు.


యువరాజ్: తనని ఎందుకు కొట్టావు అని నిలదీస్తాడు.


కేదార్: ధాత్రి నిషికకి అక్క. తను తప్పు చేస్తే సరిదిద్దే హక్కు దానికి ఉంది. ఇది అక్కచెల్లెళ్ల గొడవ మనం మధ్యలో దూరకుండా ఉంటే మంచిది అంటాడు.


మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు కొట్టావు అని అడగటంతో ధాత్రి అడుగుతున్నారు కదా ఎందుకు కొట్టానో చెప్పు అనే నిషికతో అంటుంది.


కేదార్: నిషిక ఏమీ మాట్లాడకపోవటంతో పెన్ డ్రైవ్ తీసి దివ్యాంకకి ఇచ్చిందని చెప్తాడు.


ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను ఇవ్వలేదు అని నిషిక అంటే అయితే మా ఎదురుగానే దివ్యాంకతో స్పీకర్లో మాట్లాడు అని చెప్పి దివ్యాంక కి రింగ్ చేసి ఇస్తుంది.


దివ్యాంక : ఫోన్ లిఫ్ట్ చేసిన దివ్యాంక పెన్ డ్రైవ్ సేఫా అని అడగకు, అది నా దగ్గర భద్రంగా ఉంది టైం చూసి టీవీలో వేద్దాం అంటుంది.


అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.


ధాత్రి : ప్రొఫెషనల్ గొడవల్ని ఇంటి వరకు తీసుకువచ్చి నా చెల్లెల్ని తన ఇంట్లోనే దొంగని చేశావు, దీనివల్ల మా వదిన బాధపడుతుంది అంటే నేను చూస్తూ ఊరుకోను అని దివ్యాంకని హెచ్చరిస్తుంది.


కౌషికి : అప్పుడే అక్కడికి వచ్చి ఆ మాటలు విన్న కౌషికి నిషిక ని కోప్పడుతుంది. పెన్ డ్రైవ్ పోతే ఎలా పోయిందని ఆలోచించాను కానీ ఎవరైనా తీసి ఎవరికైనా ఇచ్చారేమో అని ఆలోచించలేకపోయాను. ఇంత జరిగాక కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ముందు బయటికి పో అంటుంది.


ఆ మాటలకి యువరాజ్ అడ్డు చెప్తే నాకు అడ్డు చెప్పొద్దు తను ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోను. నీకు అంతగా అభ్యంతరం అయితే నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపో అంటుంది.


వైజయంతి: అప్పుడే అక్కడికి వస్తున్న వైజయంతి ఆ మాటలు విని తను ఎక్కడికి వెళ్ళదు, వెళ్లాల్సిన అవసరం తనకి లేదు అంటుంది.


కౌషికి :తను తప్పు చేసింది పిన్ని అంటుంది.


వైజయంతి: అయినప్పటికీ కూడా తను బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. తను వజ్రపాటి వారి ఇంటి కోడలు ఈ ఇంటి కోడలికి దక్కే గౌరవం ఇదేనా అయినా తను ఏం తప్పు చేసింది అంటుంది.


ధాత్రి : జరిగిందంతా చెప్తుంది.


వైజయంతి : ఫంక్షన్ తాలూకా ఫుటేజ్ కావాలంటే ఇచ్చింది అంతేకానీ తనేమీ మినిస్టర్ కి సంబంధించిన పెన్ డ్రైవ్ అని చెప్పలేదు కదా అని చెప్పి కోడల్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.


కౌషికి : ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావడం లేదు అంటుంది.


ధాత్రి : ఏది ఎలా జరిగినా ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని వదినకి మాట ఇస్తుంది.


గదిలోకి వెళ్ళిన తర్వాత అత్త ని హాగ్ చేసుకుని సేవ్ చేసినందుకు థాంక్స్ చెప్తుంది నిషిక.


వైజయంతి: ముందు ఆ దివ్యాంకకి ఫోన్ చేసి తనని కూడా హెచ్చరించు లేదంటే ధాత్రి తనని కూడా ఇలాగే ట్రాప్ చేస్తుంది అని చెప్తుంది.


నిషిక : దివ్యాంక కి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది.


దివ్యాంక : ఆ ధాత్రి షార్ప్నెస్ కి తను చేయవలసింది పోలీసు ఉద్యోగం కానీ పంతులమ్మ ఉద్యోగం కాదు. వాళ్ళ ఇంట్లో ఉన్నంతవరకు నువ్వు అనుకున్నది సాధించలేవు ఎలాగైనా వాళ్ళని బయటికి పంపించేయ్ అని సలహా ఇస్తుంది.


మరోవైపు ధాత్రి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది, వాళ్లే పోలీసులు అనటానికి ఒక్క ఆధారం దొరికిన చాలు వాళ్ల సంగతి చూస్తాను అని చెప్పి వాళ్ళ రూమ్ లోకి వెళ్లి ఆధారాల కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఏమీ దొరకకపోవడంతో చికాగ్గా దుప్పటి దులుపుతాడు. అందులోంచి ఐడెంటిటీ కార్డులు జారీ కింద పడతాయి. సరిగ్గా అదే సమయానికి దాత్రి దంపతులు రూమ్ లోకి వస్తారు. అక్కడ ఉన్న యువరాజ్ ని చూసి షాక్ అవుతారు.


ధాత్రి: నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.


యువరాజ్: కీర్తి నా చార్జర్ తీసుకొని వెళ్ళిపోయింది ఇక్కడ గాని పెట్టిందేమో అని వెతుకుతున్నాను అంటాడు. అయితే గదిలోకి వచ్చినప్పుడే తన చార్జర్ ని అక్కడ పెడతాడు యువరాజ్.


అయితే ఐడి కార్డులు కింద పడి ఉండడం గమనించిన ధాత్రి వాళ్లు అలర్ట్ అవుతారు. కబోర్డ్ మీద ఉన్న చార్జర్ యువరాజ్ చేతిలో పెడతారు. యువరాజ్ గదిలోంచి వెళ్లిపోయిన తర్వాత కిందపడిన కేదార్ ఐడి కార్డు తీసుకుంటారు. ధాత్రి ఐడి కార్డు కోసం చూస్తే అది యువరాజ్ కాలికి అతుక్కొని అతనితో పాటే వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.