తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 16 వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. టెట్-2023కు సంబంధించి ఆగస్టు 14న సాయంత్రం నాటికి మొత్తం 2,23,811 మంది దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పేపర్‌-1కు 68,062 దరఖాస్తులు, పేపర్‌-2కు 12,815 దరఖాస్తులు చేసుకోగా రెండు పేపర్లకు కలిపి 1,42,934 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా ఫీజు చెల్లింపు చేసినవారు 2,32,231కాగా.. వచ్చిన దరఖాస్తులు 2,23,811 ఉన్నాయని తెలిపారు.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 15న కంప్యూటర్‌ ఆధారిత విధానంలో 'టెట్' పరీక్ష నిర్వహించనున్నారు. 


సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్-2023కు సంబంధించి పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అర్హత ఉన్నవారు రాయడానికి అర్హులు. అదేవిధంగా బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివుతున్నవారు కూడా టెట్ రాయడానికి అర్హులే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు జరుగనున్నాయి. సెప్టెంబరు 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. 


తెలంగాణ టెట్ అర్హతలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..


ముఖ్యమైన తేదీలు..


➥ టెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి: 01.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 16.08.2023.


➥ హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో:  01.08.2023 - 15.08.2023.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 09.09.2023.


➥ టెట్ పరీక్ష తేదీ: 15.09.2023.


పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.


పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.


Notification - TSTET 2023


Online Application


Information Bulletin 


ALSO READ:


గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తుల సవరణకు అవకాశం - ఈ తేదీల్లోనే!
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన చేసింది. పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఆగస్టు 16న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. నిర్ణీత గడువులోగా మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కేవలం ఒక్కసారి మాత్రమే దరఖాస్తులను సవరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి వివరాలు మార్చుకునేవారు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
లక్షలాది మంది విద్యార్థుల అభ్యర్థించడంతో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సీఎం కేసీఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్ ను రీ షెడ్యూల్ చేయాలని సూచించారు. సీఎస్ శాంతికుమారి, TSPSC చైర్మన్, కార్యదర్శులతో ఈ విషయంపై చర్చించారు. తాజాగా టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 2, 3 తేదీలలో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లలో మొత్తం 4 పేపర్ల పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు.
గ్రూప్-2 పరీక్ష పూర్తి వివరాలను క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...