సీఐఎస్‌ఎఫ్‌లో కానిసేబుల్ (ఫైర్) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఆన్సర్ కీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ సెప్టెంబరు 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీ చూసుకోవడం ద్వారా పరీక్షలో మార్కులపై ఓ అంచనాకు రావొచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీతోపాటు ఫలితాలను అక్టోబరు మొదటివారంలో వెల్లడించే అవకాశం ఉంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 


CISF Fireman Answer Key Direct Link 


పరీక్షలో అర్హత మార్కులు ఇలా..
సీబీటీ విధానంలో నిర్వహించిన రాతపరీక్షలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 35 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ అభ్యర్థులకు 33 శాతంగా నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పేలెవల్-3 కింద నెలకు రూ.21,700 - రూ.69,100 జీతంగా చెల్లిస్తారు.


సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1149 కానిస్టేబుల్/ఫైర్ పోస్టుల భర్తీకి గతేడాది (2022) జనవరిలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 29 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మార్చి 7 వరకు ఫీజు స్వీకరించారు. అభ్యర్థులకు ఆగస్టు 16 నుంచి అక్టోబరు 10 వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో నిర్వహించే రాతపరీక్ష హాల్‌టికెట్లను 2023, సెప్టెంబరు 14న సీఐఎస్‌ఎఫ్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 26న రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని తాజాగా విడుదల చేసింది. అక్టోబరు మొదటివారంలో ఫలితాలను వెల్లడించనున్నారు. 


Notification


ALSO READ:


ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన 'కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌(సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ)-2023 'టైర్‌-1' రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సెప్టెంబరు 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. మొత్తం మూడు జాబితాల్లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. ఫలితాలకు సంబంధించి మొదటి జాబితా(లిస్ట్-1)లో ఎల్‌‌డీసీ/జేఎస్‌ఏ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు, రెండో జాబితా(లిస్ట్-2)లో డీఈఓ (కాగ్/సీఏఎఫ్‌పీడీ) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు, ఇక మూడో జాబితా(లిస్ట్-3)లో డీఈఓ (కాగ్/సీఏఎఫ్‌పీడీ మినహాయించి) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పొందుపరిచింది. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు
చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 47 టెక్నికల్, ల్యాబొరేటరీ పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రస్తుతానికి ఉద్యోగ ప్రకటన మాత్రమే సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400 - రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 - 56,900 వరకు జీతం చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..