హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులకు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(హ్యూమానిటి/సోషల్ సైన్సెస్/సోషియాలజి/సైకాలజీ/సోషల్ వర్క్), కంప్యూటర్ అప్లికేషన్స్, డేటాఎంట్రీ ఆపరేషన్స్ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి నోటిఫికేషన్ వెలువడిన 10 రోజులలోగా సంబంధిత చిరునామాలో అందచేయాలి.


వివరాలు..


1) హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్: 01 పోస్టు


అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీఏ(హ్యూమానిటి/సోషల్ సైన్సెస్/సోషియాలజి/సైకాలజీ/సోషల్ వర్క్).  సంబధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. 


వయసు: 21 - 45 సంవత్సరాలు మించకూడదు. 


జీతం:  నెలకి రూ.50,000.


2) డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు


అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్, డేటాఎంట్రీ ఆపరేషన్స్ ఉత్తీర్ణత ఉండాలి. 


వయసు: 21 - 45 సంవత్సరాలు మించకూడదు. 


జీతం:  నెలకి రూ.26,749.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణిత దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి నోటిఫికేషన్ వెలువడిన 10 రోజులలోగా డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగుల అండ్ వయోవృద్ధుల సంక్షేమ శాఖ మలక్‌పేట, నల్గొండ క్రాస్ రోడ్ హైదరాబాద్ నందు సమర్పించవలెను.


Website 



Also Read:


DMHO: నెల్లూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు, వివరాలు ఇలా!
నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన పీడియాట్రిషియన్(టెలిమెడిసిన్ హబ్), జనరల్ ఫిజిషియన్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో 75శాతం ఉత్తీర్ణత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 20 సా. 5.30 లోపు ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాలో అందజేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


DMHO: వైఎస్‌ఆర్‌ జిల్లాలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, అర్హతలివే!
వైఎస్ఆర్ జిల్లా కడప, ప్రొద్దుటూరులోని టెలిమెడిసిన్ హబ్‌లో ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్, మెడికల్ ఆఫిసర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో 75శాతం ఉత్తీర్ణత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 20 సా. 5.30 లోపు ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, వైఎస్ఆర్ జిల్లా, కడప చిరునామాలో అందజేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...