Telangana State Road Transport Corporation Recruitment: తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్ న్యూస్ తెలిపింది. సంస్థలో ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు రవాణా, బీసీ, సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు తెలిపారు. త్వరలోనే ఆర్టీసీలో 3 వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని ఆయన వెల్లడించారు. నియామకాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించి, జనవరి 31న కార్మికులకు శుభవార్త అందిస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


జనవరి 28న కరీంనగర్-2 డిపో ప్రాంగణంలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. ఆర్టీసీలో ప్రస్తుతం 43 వేల మంది పని చేస్తున్నారని, పదేళ్లుగా కొత్త నియామకాలు లేవని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. కొత్తగా మూడు వేల బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలోనే పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని మంత్రి అన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయబోతున్నామని, వాటిలో దాదాపు 3 వేల మంది సిబ్బందిని తీసుకుంటామని మంత్రి అన్నారు. 


ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారని, గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పరచుకొని కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు జనవరి 31న ఉద్యోగాల భర్తీకి సంబంధించి శుభవార్త వస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1325 డీజిల్, 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వీటితో పాటు ఇంకొన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోందని చెప్పారు. 


డ్రైవర్లు, కండక్టర్ పోస్టులే ఎక్కువ..
ఈ ఉద్యోగ నియామకాల్లో డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌ ఎక్కువగా ఉండనుందట. కొత్త బస్సులు వస్తున్నాయని కాబట్టి ఎక్కువ మంది స్టాఫ్ అవసరం అవుతారని భావించి ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


150 అప్రెంటిస్ పోస్టులు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల(డిపో/యూనిట్‌)లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ (బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీల్లో 25 శాతం (38 పోస్టులు) బీసీలకు కేటాయించారు. ఎస్సీలకు 1:16 నిష్పత్తిలో, ఎస్టీలకు 1:16 నిష్పత్తిలో ఎస్టీలకు కేటాయించారు. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...