Telangana DSC Halltickets: తెలంగాణలో జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను విద్యాశాఖ జులై 11న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ పేపెంట్ రిఫరెన్స్ ఐడీ లేదా ఆధార్ నెంబరు, పోస్ట్ కేటగిరీ, మీడియం, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డీఎస్సీ ప‌రీక్షల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయడంతోపాటు 25 వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ ప్రక‌టించాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా.. షెడ్యూలు ప్రకారమే పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గుచూపింది.  ఈ మేరకు తాజాగా పరీక్షల హాల్‌టికెట్లను విడుదల చేసింది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి. 

డీఎస్సీ (TG DSC Halltickets) హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

డీఎస్సీ-2024 పరీక్ష విధానం..

డీఎస్సీ సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్‌ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ పరీక్ష పేపరు
18.07.2024 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్
19.07.2024 సెకండరీ గ్రేడ్ టీచర్
20.07.2024 స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్), సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) 
22.07.2024 సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్) 
23.07.2024 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఇంగ్లిష్, తెలుగు) 
24.07.2024 స్కూల్ అసిస్టెంట్ (బయలాజికల్ సైన్స్)
25.07.2024 స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మరాఠీ)
26.07.2024 లాంగ్వేజ్ పండిట్(తెలుగు), సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)
30.07.2024 స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)
31.07.2024 స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్), స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్), స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్)
01.08.2024 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఇంగ్లిష్, తెలుగు), స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) 
02.08.2024 లాంగ్వేజ్ పండిట్(తెలుగు), స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్), స్కూల్ అసిస్టెంట్ (హిందీ), లాంగ్వేజ్ పండిట్ (కన్నడ, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం)   
05.08.2024 స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజ్ పండిట్ (హిందీ)

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT Posts)-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ (School Assistants) - 2,629 పోస్టులు,  లాంగ్వేజ్ పండిట్ (Laungage Pandi Posts) - 727, పీఈటీలు (PET. Posts)-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఇక జిల్లావారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలను భర్తీ చేయనన్నారు. ఆ తర్వాత స్థానాల్లో రాజన్న సిరిసిల్ల (151), వనరపర్తి (152) ఉన్నాయి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..