తెలంగాణలో టెట్-2023 నోటిఫికేషన్ ఆగస్టు 1న వెలువడిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాసే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 15న కంప్యూటర్‌ ఆధారిత విధానంలో 'టెట్' పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.


ఈ నేపథ్యంలో టెట్‌ పరీక్ష దరఖాస్తు ఫీజును రూ.400గా నిర్ణయించడంపై విమర్శలొస్తున్నాయి. రాష్ట్రంలో 2016లో తొలిసారి నిర్వహించిన టెట్‌కు రూ.200 ఫీజు ఉండగా, 2017లోనూ అదే ఫీజును కొనసాగించారు. ఇక 2022 జూన్‌లో పరీక్ష ఫీజును రూ.300కి పెంచారు. తాజాగా రూ.400కి పెంచారు. టెట్ ఫీజును పాఠశాల విద్యాశాఖ రూ.100 పెంచడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.


టెట్ దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించి బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు పేపర్‌-2తో పాటు పేపర్‌-1 కూడా రాసుకోవచ్చు. అయితే పేపర్‌-1 మాత్రమే రాసే తమకు కూడా రూ.400 వసూలు చేయడమేంటని డీఈడీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఫీజును తగ్గించాలని రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


వారికి కూడా తగ్గింపు లేదు..
రాష్ట్ర, జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలైనా, ఉద్యోగ పోటీ పరీక్షలైనా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం కొంత తగ్గిస్తారు. రాయితీ ఇవ్వని ఏకైక పరీక్ష టెట్‌. దీనిపై ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా, టెట్‌ కమిటీ విధానాల మేరకే నిర్ణయం తీసుకున్నామని సమాధానమిచ్చారు.


ముఖ్యమైన తేదీలు..


➥ టెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి: 01.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 16.08.2023.


➥ హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో:  01.08.2023 - 15.08.2023.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 09.09.2023.


➥ టెట్ పరీక్ష తేదీ: 15.09.2023.


పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.


పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.


Online Payment 


Online Application


తెలంగాణ టెట్ నోటిఫికేషన్, పరీక్ష విధానం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..