TSPSC DAO EXAM DATES: తెలంగాణలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఇందులో డివిజనల్ అకౌంట్స్ అధికారి (DAO), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణ తేదీలను కమిషన్ వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం DAO పోస్టులకు వచ్చే జూన్ 30న, వార్డెన్ పోస్టులకు జూన్ 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) మార్చి 13న ప్రకటించింది. 


డీఏఓ పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు పేపర్-1 (జనరల్ స్టడీస్), పేపర్-2 (అరిథ్‌మెటిక్) పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ సూచించింది. ఇక హాస్టల్ వెల్ఫేర్ అధికారి(వార్డెన్) పోస్టులకు దరఖాస్తు చేసినవారికి జూన్ 24 నుంచి పరీక్షలు ప్రారంభిస్తామన్నారు. వీరికి పేపర్-1 (జనరల్ స్టడీస్), పేపర్-2 (సబ్జెక్టు సంబంధిత) పరీక్షలు ఉంటాయి. ఏ రోజు ఏ పోస్టుకు పరీక్ష ఉంటుందనే వివరాలను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. దరఖాస్తుదారులకు హాల్‌టిక్కెట్లను పరీక్ష తేదీలకు వారం ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు.


డీఏవో పోస్టుల వివరాలు..
తెలంగాణలో 53 డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ పోస్టుల భర్తీకి 2022 ఆగస్టు 4న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గతేడాది ఫిబ్రవరి 20న రాతపరీక్ష హాల్‌టికెట్లను విడుదల చేసింది. ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించింది. కాగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో) పరీక్షను వాయిదావేసింది. తాజాగా పరీక్షల రీషెడ్యూలు తేదీని టీఎస్‌పీస్సీ వెల్లడించింది. జూన్ 30న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.


* డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్స్ (గ్రేడ్-2): 53 పోస్టులు


పోస్టుల కేటాయింపు: ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-05, బీసీ-14, ఎస్సీ-09, ఎస్టీ-04, దివ్యాంగులు-02.


రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 అరిథ్‌మెటిక్ & మెన్సురేషన్ నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


పే స్కేలు: రూ.45,960- రూ.1,24,150.


పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.


* హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ పోస్టుల వివరాలు..


తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  


పోస్టుల వివరాలు..


ఖాళీల సంఖ్య: 581


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -1): 05 పోస్టులు
విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్.


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -2): 106 పోస్టులు
విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్.


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు: 70
విభాగం: ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌.


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్): 228
విభాగం: ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌.


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (): 140
విభాగం: బీసీ వెల్ఫేర్.


➥ వార్డెన్ (గ్రేడ్ -1): 05
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.


➥ మ్యాట్రన్ (గ్రేడ్ -1): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.


➥ వార్డెన్ (గ్రేడ్-2): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.


➥ మ్యాట్రన్ (గ్రేడ్-2): 02
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.


➥ లేడి సూప‌రింటెండెంట్: 19
విభాగం: చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.


పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో ఉంటాయి.