Seethe Ramudi Katnam Today Episode రాత్రి సీత ఏదో పని చేసుకుంటుంటే రామ్ వెనక నుంచి సీతని పట్టుకోవాలి అని దగ్గరు వెళ్తాడు. ఇంతలో వద్దు అనుకొని మళ్లీ వెనక్కి వెళ్తాడు. ఇంతలో సీత చూసి ఎప్పుడొచ్చావు మామ అని అంటుంది. దానికి రామ్ ఏంటి సీత ఈరోజు స్పెషల్‌గా కనిపిస్తున్నావు అని అంటాడు.
సీత: ఎలా కనిపిస్తే ఏం లాభం. మీరు బెడ్ మీద నేను కింద చాప మీద.
రామ్: అంటే నువ్వు మా పిన్నితో క్లోజ్ అయ్యే వరకు మనకు ఈ దూరం తప్పుదు.
సీత: అదే కారణమా మామ.
రామ్: మీరిద్దరూ పాము ముంగిసల్లా ఉంటే మనద్దరం పావురాల్లా ఉండటం ఎలా..
సీత: మీరేమో ఇలా ఆలోచిస్తున్నారు కానీ బయట వేరేలా వినిపిస్తున్నాయి. మీ గురించి మరోలా మాట్లాడుతున్నారు.
రామ్: మరోలా అంటే కాస్త అర్థమయ్యేలా చెప్పు.
సీత: వద్దులే మామ చెప్తే నువ్వు ఫీలవుతావు. అందరూ నిన్ను తేడా అనుకుంటున్నారు మామ..
రామ్: అవునా మరి నువ్వేమనుకుంటున్నావు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా..
సీత: లేదు లేదు.. కానీ కంట్రోల్ లేని వీరాధివీరుడు.. అంటే నేను ఇలా చాపమీద కాకుండా బెడ్ మీద నీ పక్కన పడుకున్నాను అనుకోండి. మీరు నిగ్రహించుకోలేని బలహీనులు అని నా ఫీలింగ్.
రామ్: ఏయ్ నాగురించి నీకు తెలీదు. మా పిన్ని కోసం నేను దూరంగా ఉన్నాను అంతే.. కావాలంటే నువ్వు నా బెడ్ మీద నా పక్కన పడుకో..
సీత: నిజంగా అంటున్నావా మామ. సరే అయితే నీ పక్కనే పడుకుంటా..
జనార్ధన్: అయితే మధుమితకు కొత్త డ్రస్‌లు, నగలు ఇచ్చారన్నమాట.
అర్చన: అంతే కాదు బావగారు రామ్‌కి సీత అంటే ఇష్టం లేదు అని ఇద్దరి పక్కలు వేరని చెప్పాం. రామ్‌కి ఇంకా మధుమిత అంటేనే ఇష్టం అని చెప్పాం. ఎంత మధుమిత సీతకు సొంత అక్కే అయినా సీతకు మధుమిత మీద ఆ జలస్ ఉండే ఉంటుంది.
గిరిధర్: అంతేగా మరి ఎక్కడ రామ్ మధుమితని ఇష్టపడతాడో అని సీతకు టెన్షన్ మొదలవుతుంది.
మహాలక్ష్మి: ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ టెన్షన్‌కు బీపీ పెరిగి మన కళ్లముందు కుప్ప కూలిపోవడం ఖాయం.
ఇక రామ్ సీతను తన బెడ్ మీద పడుకోమని చెప్పడంతో సీత చాప దిండును తీసుకొచ్చి హాల్‌లో మహాలక్ష్మి వాళ్లు మాట్లాడుకుంటున్న దగ్గర పడేస్తుంది.
సీత: మహాలక్ష్మి వాళ్లు వినేలా.. మామ నువ్వు చెప్పినట్టు దిండు, చాప బయట పడేశా. ఇక వాటితో మనకు అవసరం లేదు కదా.. ఈ రోజు మనద్దరం ఒకే బెడ్ మీద పక్కపక్కన పడుకోబోతున్నాం కదా మామ.
గిరిధర్: రామ్ సీతలు ఒక బెడ్ మీద పడుకోవడం ఏంటి.
సీత: మన పక్కలు ఒకటి చేసి ఈరోజు నుంచి మనం భార్యభర్తలుగా ఉండబోతున్నాం కదా మామ. మహాలక్ష్మివాళ్లు షాక్ అవుతారు. అబ్బా కంగారు పడకు మామ నా మాటలు ఎవరూ వినడం లేదు. కింద ఎవరూ లేరు మామ. నీకు తొందర ఎక్కువ మామ. ఈ రాత్ర మనకు శివరాత్రి.. అని కావాలనే మహాలక్ష్మి వాళ్లను రెచ్చగొడుతుంది.
అర్చన: రామ్ చెప్పకుండా సీత వీటిని కింద పడేయదు కదా..
గిరిధర్: అంటే ఈ రాత్రికి కొంపలు అంటుకుంటాయి వదినా.
అర్చన: వాళ్లు కమిట్ అయితే చాలా ఇబ్బంది మహ.
మహాలక్ష్మి: పదండి వాళ్ల సంగతి తేల్చుదాం.. అని వాళ్ల గది దగ్గరకు వెళ్తారు. అప్పుడే రేవతి, చలపతి అడ్డుకుంటారు. ఏం జరిగింది అని సెటైర్లు వేస్తారు.
చలపతి: సీత దిండు దుప్పటి కింద పడేయడం మేం చూశాం.
రేవతి: మీరు షాక్ అయ్యారు. మేం సర్‌ఫ్రైజ్ అయ్యాం.
చలపతి: సీతా రాముల తొలిరేయి ఈరోజు జరుగుతుంది.
మహాలక్ష్మి: తొలిరేయా అలాంటిదేమీ లేదు..
జనార్థన్: ముహూర్తం లేకుండా ఎలా ఒకటి అవుతారు.
రేవతి: మీరు ముహూర్తం పెట్టకుండా టైం వేస్ట్ చేస్తే వాళ్లు మాత్రం ఏం చేస్తారు.
అర్చన: ఇప్పుడేం చేద్దాం మహా. ఇద్దరిని బయటకు పిలుద్దామా..
జనార్ధన్: చలపతి, రేవతి ఏదో అన్నారు అని మనం వెనక్కి తగ్గొద్దు.
మహాలక్ష్మి: ఇప్పుడేం అనొద్దు వీళ్ల సంగతి రేపు చూద్దాం. ఏం జరగదు మీరు మీ రూంకి వెళ్లిండి..
సీత, రామ్‌లు ఒకర్ని ఒకరు చూసుకుంటూ సిగ్గు పడతారు.తర్వాత ఇద్దరూ ఒకే బెడ్ మీద పడుకుంటారు. సీత కావాలనే తన మాటలతో రామ్‌ని రెచ్చగొడుతుంది. కావాలనే రామ్ మీద చేయి వేసుకొని పడుకుంటుంది. ఇక రామ్‌ని కూడా తన మీద చేయి వేయమని అంటుంది. ఇక సీత, రామ్‌లు హగ్ చేసుకొని ఒకటైనట్లు మహాలక్ష్మి కలకంటుంది. దీంతో కంగారు పడి లేచి.. రామ్ దగ్గరకు వెళ్దామని అంటుంది. సీతని బయటకు పంపేయాలి అని అంటుంది. రామ్ మీద తనకు నమ్మకం ఉందని సీత మీద లేదు అని అంటుంది. ఒకసారి రామ్‌తో మాట్లాడుదాం అంటుంది. చాలా టెన్షన్ పడుతుంది. జనార్థన్ మహాలక్ష్మికి సర్దిచెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.