TG Court Jobs:తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర హైకోర్టు శుభవార్త తెలిపింది. తెలంగాణ హైకోర్టు పరిధిలోని కోర్టులతోపాటు.. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్‌లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్‌, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్‌, కంప్యూటర్‌ అపరేటర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ ఖాళీల భర్తీకి జనవరి 08 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.600; ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీఎస్‌ అభ్యర్థులకు రూ.400 చెల్లించాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్‌ టెక్నికల్ పోస్టులకు జూన్‌ నెలలో పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.  పరీక్ష తేదీ వెల్లడి కావాల్సిఉంది.


వివరాలు...


* ఖాళీల సంఖ్య:  1673  


తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో


మొత్తం పోస్టుల సంఖ్య: 1461


1) నాన్‌ - టెక్నికల్: 1277 


2) టెక్నికల్: 184


పోస్టులు: ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III.


తెలంగాణ హైకోర్టు పరిధిలో: 


మొత్తం పోస్టుల సంఖ్య: 212.


1) కోర్టు మాస్టర్‌ అండ్ పర్సనల్ సెక్రటేరియస్‌:  12 


2) కంప్యూటర్‌ అపరేటర్‌: 11 


3) అసిస్టెంట్: 42 


4) ఎగ్జామినర్‌: 24 


6) టైపిస్ట్: 12 


7) కాపిస్ట్: 16 


8) సిస్టమ్‌ అనలిస్ట్: 20 


9)  ఆఫీస్‌ సబార్డినేట్: 75 


అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 


వయోపరిమితి: 18 - 34 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  


దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీఎస్‌ అభ్యర్థులకు రూ.400.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష,  మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్‌ ఇంగ్లిష్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.01.2025.


* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 31.01.2025.


* పరీక్ష తేదీలు: టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్‌ టెక్నికల్ పోస్టులకు జూన్‌ 2025.


Notifications..


Telangana Judicial Ministerial and Subordinate Service


Office Subordinate

Process Server

Record Assistant  

Copyist

Examiner  

Field Assistant

Typist  

Junior Assistant

Stenographer Grade III


Service of the High Court for the State of Telangana 


Office Subordinates  

System Assistant

Copyist  

Typist  

Examiners

Assistants

Computer Operator  

Court Masters and Personal Secretaries (to the Honourable Judges and Registrars)


ALSO READ:  SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...