Telangana State Electricity Regulatory Commission Recruitment: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (TSERC) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 1లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


పోస్టుల వివరాలు..


* ఖాళీల సంఖ్య: 28


➥ జాయింట్‌ డైరెక్టర్‌ / ఇంజినీరింగ్‌: 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ / ట్రాన్స్‌మిషన్‌: 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ / డిస్ట్రిబ్యూషన్‌: 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ / లా: 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ / లీగల్‌ ప్రొసీజర్: 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ / టారిఫ్‌ (అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అనాలసిస్‌): 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ - టారిఫ్‌ (ఎకనామిక్స్‌): 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ - టారిఫ్‌ (ఇంజినీరింగ్‌): 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ / ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ / పే అండ్‌ అకౌంట్స్‌: 01 పోస్టు


➥ డిప్యుటీ డైరెక్టర్‌ / కన్సూమర్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు


➥ అకౌంట్‌ ఆఫీసర్‌: 01 పోస్టు


➥ క్యాషియర్‌: 01 పోస్టు


➥ లైబ్రేరియన్‌: 01 పోస్టు


➥ స్టెనో కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌: 02 పోస్టులు


➥  క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌: 04 పోస్టులు


➥ పర్సనల్‌ అసిస్టెంట్‌: 02 పోస్టులు


➥ రిసెప్షనిస్ట్‌: 01 పోస్టు


➥ ఆఫీస్‌ సబార్డినేట్స్‌: 05 పోస్టులు


అర్హత: టెన్త్‌, డిప్లొమా ఇంజినీరింగ్‌, లా. ఎలక్ట్రికల్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌, అకౌంటింగ్‌/ కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎలక్ట్రికల్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ లో డిగ్రీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి. ఆఫీస్‌ సబార్డినేట్స్‌ పోస్టుకు లైట్‌ వేకిల్‌ లైసెన్స్‌, డైవింగ్‌ అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 46 సంవత్సరాలకు మించరాదు.


దరఖాస్తు ఫీజు: రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 'TSERC Fund' పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో నిర్ణీత మొత్తంతొ డిడి తీయాల్సి ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత మొత్తంతో ఫీజు చెల్లించాలి. సంబంధిత చిరునామాకు దరఖాస్తుతోపాటు డిడిని జతచేసి పంపాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Commission Secretary, 
D.No.11-4-660, 5th Floor, 
Sinagareni Bhavan, Red Hills, 
Hyderabad 500 004.


దరఖాస్తు చివరి తేదీ: 01.04.2024.


Notification & Application


Website


ALSO READ:


రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్ల పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శ్రీకారంచుట్టింది. దీనిద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) విభాగాల్లో మొత్తం 4,660 ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో సబ్-‌ఇన్‌స్పెక్టర్(RPF SI) - 452 పోస్టులు, కానిస్టేబుల్ (RPF Constable) - 4208 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సంక్షిప్త ప్రకటనను రైల్వేశాఖ(RRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...