తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలలకు ఆగస్టు 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలు, ఇతర అధికారులతో టీఎస్‌పీఎస్సీ అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. పరీక్షలకు వారం ముందునుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష నిర్వహణ పూర్తయ్యాక.. ప్రిలిమినరీ కీని సెప్టెంబరులోగా ప్రకటించనుంది.
పరీక్షలకు హాజరుకానున్న 5.5 లక్షల అభ్యర్థులు..
రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు సంబంధించి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాక డబుల్ బబ్లింగ్‌పై న్యాయవివాదాలు తలెత్తాయి. దీంతో ఫలితాల వెల్లడికి దాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ప్రస్తుతం గ్రూప్-2 నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా, వివాదాలకు ఆస్కారం లేకుండా కమిషన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు, కళాశాలలకు జిల్లా విద్యాధికారులు, ఇంటర్‌బోర్డు ద్వారా సమాచారం పంపించింది. వారాంతపు సెలవుల్లో పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ, అప్పటికే వేర్వేరు కేంద్రప్రభుత్వ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. దీంతో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.
తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు.గ్రూప్-2 పోస్టులకు మొత్తం 5,51,943 దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు...
* గ్రూప్-2 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 783
1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు
విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.
3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు
విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.
5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు
విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.
6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.
7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.
8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు
విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.
9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు
విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.
10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు
విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు
విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.
12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు
విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.
13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు
విభాగం: లా డిపార్ట్‌మెంట్.
14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్.
15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు
విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్.
16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.
గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి..