NGB(DU) Admission to Ph.D. Program: నెహ్రూ గ్రామ భారతి(డీమ్డ్ టు బి యూనివర్సిటీ) 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంబైన్డ్ రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 24వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. 


ప్రోగ్రామ్ వివరాలు..


* పీహెచ్‌డీ ప్రోగ్రామ్(ఫుల్‌ టైమ్‌/ పార్ట్ టైమ్)


* కంబైన్డ్ రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్(CRET)-2023


విభాగాలు: ఎకనామిక్స్: 02, జాగ్రఫీ: 01, సోషియాలజీ: 02, సంస్కృతం: 06, పొలిటికల్ సైన్స్: 02, ఫిలాసఫీ: 04, హోమ్ సైన్స్: 01, హిందీ: 14, ఇంగ్లీష్: 04, ఎడ్యుకేషన్: 02, పురాతన చరిత్ర: 06, జర్నలిజమ్‌& మాస్ కమ్యూనికేషన్: 01, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్: 01, మ్యుజిక్: 02, స్పెషల్ ఎడ్యుకేషన్: 04, టీచర్ ఎడ్యుకేషన్: 20, కంప్యూటర్ అప్లికేషన్: 01, మేనేజ్‌మెంట్: 02, లా: 10, బోటనీ: 06, జువాలజీ: 07, మ్యాథ్స్: 02, ఫిజిక్స్: 10, కెమిస్ట్రీ: 03, కామర్స్: 06, సోషల్ వర్క్(ఎమ్‌ఎస్‌డబ్ల్యూ): 02. 


అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.2500.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.08.2023.


సీఆర్ఈటీ -2023 పరీక్ష తేదీ: 24.09.2023.


Notification  


Website


ALSO READ:


'గేట్‌-2024' షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఈసారి కొత్త పేపరు జోడింపు!
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..