Pepperfry CEO Death: ప్రముఖ ఫర్నీచర్, హోమ్ డెకార్ ఈ కామర్స్ సంస్థ పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు  సీఈఓ అంబరీష్ మూర్తి (51) గుండెపోటుతు హఠాన్మరణం చెందారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా ఎక్స్ ట్విట్టర్ వేధికగా ఆయన చనిపోయినట్లు తెలిపారు. తన స్నేహితుడు, సహచరుడు పలు విషయాల్లో తన గురువు అయిన అంబరీష్ మూర్తి ఇకలేరంటూ ట్వీట్ చేశారు. నిన్న రాత్రి ఆయన గుండెపోటుతో లేహ్ లో చనిపోయినట్లు వెల్లడించారు. అంబరీష్ మూర్తికి బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం. ఆయన తరచుగా ముంబై నుంచి లేహ్ కు బైక్ పై వెళ్తుండేవారు. ఈక్రమంలోనే లేహ్ కు వెళ్లిన అంబరీష్ మూర్తి అక్కడే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. 






2012లో మూర్తి, ఆశిష్ తో కలిపి పెప్పర్ ఫ్రై ను స్థాపించారు. ఈ సంస్థ ఆన్ లైన్ లో ఫర్నీచర్, హోమ్ డెకార్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. పెప్పర్ ఫ్రై స్థాపించడానికి ముందు అంబరీష్ మూర్తి.. ఈబేలో భారత్, ఫిలిప్పీన్స్, మలేషియా దేశాల మేనేజర్ గా పని చేశారు. అంతకుముందు ఆయన లెవీ స్ట్రాస్, బ్రిటానియా, పీ అండ్ ఎల్ వంటి సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మూర్తి, ఐఐఎఁం కోల్ కతాలో ఏంబీఏ పట్టా అందుకున్నారు. అంబరీష్ మృతి వార్త తెలిసి అనేక మంది సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్వీట్లు చేస్తున్నారు.