తెలంగాణలో త్వరలో భారీగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. మొత్తం 10,500 టీచర్ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి కోరుతూ పాఠశాత విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. ఆర్థికశాఖ నుంచి అనుమతులు మంజూరు అయిన వెంటనే TSPSC ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన రానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 



ఇటీవల సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి హరీశ్ రావు మరికొన్ని రోజుల్లోనే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఆర్థిక మంత్రి స్వయంగా ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్‌పై అలర్ట్ అయ్యారు. మంత్రి చెప్పిన 28 వేల ఉద్యోగాల్లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. 

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో ప్రభుత్వం జూన్‌లో టెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్-1 కు సంబంధించి 3,18,44 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 32.68 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్-2కు సంబంధించి 2,50,897 మంది హాజరుకాగా.. 49 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులంతా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



ఇదిలా ఉండగా.. ఉపాధ్యాయ పోస్టుల నియామకాల నోటిఫికేషన్‌కు ముందే మరో సారి టెట్ నిర్వహించాలన్న డిమాండ్ కూడా నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే.. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 


 


Also Read:


TSPSC Recruitment: 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!
తెలంగాణ స్టేట్ ​పబ్లిక్ ​సర్వీస్​ కమిషన్ ​మరో భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్​15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


IFGTB Recruitment: ఐఎఫ్‌జీటీబీలో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు,అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)కు చెందిన కోయంబత్తూర్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనిటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్(ఐఎఫ్‌జీటీబీ) తాత్కలిక ప్రాతిపదికన వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగ విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


FCI Recruitment 2022: నిరుద్యోగులకు శభవార్త, ఎఫ్‌సీఐలో 5 వేలకుపైగా ఉద్యోగాలు!
FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ III,  ఇతరుల దరఖాస్తుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అయితే ఎఫ్సీఐ 2022 రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం వివరాలు మరియు దరఖాస్తు రుసుము వంటి  అన్ని వివరాల గురించి తెలుసుకోండి.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లియండి..