సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెప్టెంబరు 21న ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది సెప్టెంబరు 4న జూనియర్ అసిస్టెంట్ల నియామకానికి నిర్వహించిన పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. గతేడాది నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పరీక్ష ఫలితాలను వెల్లడించి, నియామక ప్రక్రియ చేపట్టవచ్చని చెప్పింది. అభ్యర్థులను ఎంపిక చేయ వచ్చని చెబుతూ.. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. 


సింగరేణి వ్యాప్తంగా 177 జూని యర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022 లో సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దాదాపు 98,882 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. జేఎన్‌టీయూ నిర్వహించిన ఈ పరీక్షలపై కొందరు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. రాత పరీక్షలను రద్దు చేస్తూ తిరిగి నిర్వహించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సింగరేణి దాఖలు చేసిన అప్పీలుపై న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం విచారణ చేపట్టింది. 


సింగరేణి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పరీక్షలను జేఎన్‌టీయూ పకడ్బందీగా నిర్వహించిందని, ఇందులో అవకతవకలకు ఆస్కారం లేదన్నారు. సుమారు 70 వేల మంది పరీక్షలు రాయగా.. 49 వేల మందికిపైగా అర్హత సాధించారని, ఈ దశలో పరీక్షను రద్దు చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తూ గత పరీక్షల ఆధారంగానే నియామకానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


గతేడాది సెప్టెంబర్‌ 4న రాష్ట్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లో నిర్వహించిన పరీక్షకు 79, 898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్‌ కాపీయింగ్, ఇతర అవ కతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్‌ సహా పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పరీక్షను రద్దు చేశారు.


నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. కాగా, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ ధర్మాసనం గురువారం (సెప్టెంబరు 21న) విచారణ చేపట్టింది. సింగరేణి తరఫున స్పెషల్‌ జీపీ ఎ.సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నియామక ప్రక్రియకు అనుమతించింది. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని చెబుతూ విచారణను వాయిదా వేసింది. కాగా, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్‌ ఫైనాన్స్‌ అండ్‌ పర్సనల్‌ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.


ALSO READ:


రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ అర్హతతో 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం
ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా ఈ పోస్టుల‌ను ఐడీబీఐ భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంట‌ర్న్‌షిప్‌, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..