తెలంగాణ వైద్యారోగ్యశాఖలో మరో 1,827 స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా వైద్యవిద్య సంచాలకుల పరిధిలోనివే. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ జూన్ 23న ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుంది.
ఇప్పటికే 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు నిరుడు డిసెంబరు 30 మెడికల్ బోర్డ్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు సంబంధించి రాత పరీక్ష ఈ ఏడాది ఆగస్టు 2న నిర్వహించబోతున్నారు. ఈ లోగానే మరో 1,827 స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మరి..ఈ కొత్త పోస్టులకు వేరే నోటిఫికేషన్ ఇస్తారా? లేక ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌లో పోస్టులను పెంచిచూపుతారా అన్న దానిపై స్పష్టత రావాల్సివుంది.
పాతపోస్టులకు ఈ కొత్త పోస్టులను కలిపితే మొత్తం 7,031 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త పోస్టులను కూడా ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ పోస్టుల్లో కలపి చూపించాలంటే మెడికల్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని వైద్యవర్గాలు వెల్లడించాయి.
మరోవైపు నర్సింగ్ అభ్యర్ధులు కూడా కొత్తగా మంజూరైన 1,827 స్టాఫ్‌నర్స్ పోస్టులను కూడా ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌లో చేర్చాలని కోరుతున్నారు. లేకుంటే మళ్లీ దానికొక ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తే... మరోమారు పరీక్ష రాయాల్సి వుంటుందని అంటున్నారు. ప్రస్తుతం 5,204 పోస్టుల రాత పరీక్ష ముగిసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు తక్కువని, అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కష్టమని నర్సింగ్ అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌లో కొత్త పోస్టులను కూడా కలపాలని సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్‌లోని 5,204 పోస్టులకు 40,926 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి కూడా కలిపితే ఒక్కో పోస్టుకు 5.8 మంది పోటీ పడనున్నారు. ఆగస్టు 2న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో రాత పరీక్ష జరగనుంది. వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఫలితాల తర్వాత 1:2 పద్ధతిలో అభ్యర్థులను పిలిచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసే అవకాశాలున్నాయి. అనంతరం ఆగస్టు చివరి నాటికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను మెడికల్ బోర్డు వైద్య ఆరోగ్యశాఖకు పంపుతుంది. ఆ జాబితా ప్రకారం జోనల్ వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇస్తారు.
ALSO READ:
'గ్రూప్-4' అభ్యర్థులకు అలర్ట్, పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు బంద్! ముఖ్య సూచనలివే!
తెలంగాణలో జూన్ 1న నిర్వహించనున్న 'గ్రూప్-4' పరీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భారీసంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 హాల్‌టికెట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు.
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మనూలో 46 టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) వివిధ ప్రాంతాల్లోని మనూ క్యాంపస్‌లలో వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, బీఎస్, ఎండీ, ఎంఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంఈడీ, ఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నెట్/ సెట్/ స్లెట్ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial