తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) ఉద్యోగాలను డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశముంది. తాజా నిర్ణయంతో బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. 


ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే రాజస్థాన్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను డీఎడ్ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీని ఎన్సీటీఈ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు దేశమంతటా అమలు కానుంది. తెలంగాణలో 6,612 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.


2,575 ఎస్జీటీ పోస్టులు వారికే..
తెలంగాణలో 6,612 టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో 2,575 ఎస్జీటీ పోస్టులే ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులను డీఎడ్‌ అభ్యర్థులతో భర్తీచేయాలన్న నిబంధన గతంలోనే అమలైంది. తర్వాత ఈ నిబంధనను సవరించి బీఈడీ వారికి అవకాశం కల్పిస్తూ 2018లో ఎన్‌సీటీఈ గెజిట్‌ను జారీచేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో బీఈడీ వారు ఎస్జీటీ పోస్టులకు అర్హత సాధించలేకపోయారు. ఎన్సీటీఈ గెజిట్‌ ఆధారంగా ప్రాథమిక పాఠశాలల టీచర్‌ పోస్టులకు బీఈ డీ వారు పోటీ పడే అవకాశాన్నిస్తూ బీహార్‌లో నోటిఫికేషన్‌ను జారీచేశారు. ఈ నోటిఫికేషన్‌ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వెలువరించగా, ఆయా నోటిఫికేషన్‌ చెల్లదని తాజాగా ధర్మాసనం తీర్పునిచ్చింది. ఎస్జీటీ పోస్టులు డీఎడ్‌ వారితోనే భర్తీచేయాలని నిర్ణయించారు.


ALSO READ:


ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024 నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను సెప్టెంబరు 6న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


పీజీసీఐఎల్‌లో 425 డిప్లొమా ట్రైనీ పోస్టులు- ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంట్ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం ద్వారా డిప్లొమా ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 425 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్- పవర్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.27,500 స్టైపెండ్‌ అందుతుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..