తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీలను కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


ఈ మేరకు రాష్ట్రంలో అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తూ దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు.  ఉద్యోగ విరమణ తర్వాత టీచర్లు, హెల్పర్లకు ఆసరా పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీల స్థాయి పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


ప్రస్తుతం ఆయాలకు రూ.30 వేలు, టీచర్లకు రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని అంగన్‌వాడీ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు టీచర్లకు ప్రోత్సాహకాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్షకు, వర్కర్లకు రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచింది. పదవీ విరమణ అనంతరం ఆసరా పింఛన్లు ప్రభుత్వం తరఫున మంజూరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4 వేల మినీ అంగన్‌వాడీలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.


ALSO READ:


టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ
తెలంగాణలో టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డీఎస్సీ ద్వారానే టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 5,089 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ డీఎస్సీలను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా వీటిని తిరిగి ఏర్పాటు చేయనుంది. ఈసారి జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో 62 అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టులు
FDDI Recruitment: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ) అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 62 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, గ్రాడ్యుయేషన్‌, బీకామ్‌, బీఏ, బ్యాచిలర్స్‌డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..