Telangana DSC 2024 Complete Schedule: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ-2024 (TG DSC) షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ జూన్ 28న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి పరీక్షల షెడ్యూలును జూన్ 29న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షలను తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించడానికి అధికారలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండటంతో.. పరీక్షల నిర్వహణకు 13 రోజుల సమయం పట్టనుంది. అయితే ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో.. పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 28న డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ద్వారా మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. డీఎస్సీ పరీక్షల సబ్జెక్టులవారీగా చూస్తే మొత్తం 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తులు అందాయి. అయితే అభ్యర్థుల పరంగా చూస్తే, సుమారు 2 లక్షల వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

డీఎస్సీ-2024 పరీక్ష విధానం..

డీఎస్సీ సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్‌ డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలు.. (TS DSC 2024 Schedule)

పరీక్ష తేదీ పరీక్ష పేపరు
18.07.2024 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్
19.07.2024 సెకండరీ గ్రేడ్ టీచర్
20.07.2024 స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్), సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) 
22.07.2024 సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్) 
23.07.2024 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఇంగ్లిష్, తెలుగు) 
24.07.2024 స్కూల్ అసిస్టెంట్ (బయలాజికల్ సైన్స్)
25.07.2024 స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మరాఠీ)
26.07.2024 లాంగ్వేజ్ పండిట్(తెలుగు), సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)
30.07.2024 స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)
31.07.2024 స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్), స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్), స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్)
01.08.2024 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఇంగ్లిష్, తెలుగు), స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) 
02.08.2024 లాంగ్వేజ్ పండిట్(తెలుగు), స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్), స్కూల్ అసిస్టెంట్ (హిందీ), లాంగ్వేజ్ పండిట్ (కన్నడ, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం)   
05.08.2024 స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజ్ పండిట్ (హిందీ)

 డీఎస్సీ పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 11,062.

➥ సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT): 6,508 పోస్టులు

➥ స్కూల్‌ అసిస్టెంట్‌: 2,629 పోస్టులు

➥ లాంగ్వేజ్ పండిట్: 727 పోస్టులు

➥  పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయులు): 182 పోస్టులు

➥ స్పెషల్ ఎడ్యుకేషన్  (స్కూల్ అసిస్టెంట్): 220 పోస్టులు

➥ స్పెషల్ ఎడ్యుకేషన్  (ఎస్జీటీ) 796 పోస్టులు

డీఎస్సీ 2024లో  జిల్లాలవారీగా ఖాళీల వివరాలు.. 

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..