తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు జులై 21న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత విద్యాసంవత్సరాల్లో నియమితులైన గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించాలని ఆదేశించింది. జూనియర్ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం జులై 18న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఇప్పటికే ఇంటర్ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజా నియామకాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు అర్హులైన గెస్ట్ ఫ్యాకల్టీని ఈ ఏడాది కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఇంటర్ కమిషనరేట్‌కు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి అధ్యాపకులను ఎంపిక చేయాలని ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని నియమించి, పీజీ మార్కుల ఆధారంగా, జిల్లా వారీగా 1:3 నిష్పత్తిలో దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా జులై 19న నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. షెడ్యూలు ప్రకారం జులై 27న అభ్యర్థుల మెరిట్ జాబితా ప్రకటిస్తారు. జులై 28న తుది ఎంపిక చేసి, నియామకపత్రాలు ఇస్తారు. నియామక పత్రాలు పొందిన వారు ఆగస్టు 1లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో జులై 24లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రిన్సిపాల్‌లతో కూడిన కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థులు పీజీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
జిల్లాలవారీగా పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
ఏకలవ్య పాఠశాలల్లో 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు - పూర్తి వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని 'నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(నెస్ట్స్)' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,329 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 5,660 టీజీటీ, 669 హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 18 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌ఐ అభ్యర్థులకు అలర్ట్, 'స్టేజ్-2' దరఖాస్తు తేదీలు వెల్లడి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎస్‌ఐ (సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జులై 21న ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులందరూ సంబంధిత సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial