ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 40,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటామని, ఈ లక్ష్యంలో కోత ఏమీ వేయబోవడం లేదని టీసీఎస్‌ స్పష్టం చేసింది. ‘ప్రాజెక్టుల వేగం మందగించడం వల్ల ఆఫర్‌ లెటర్‌ ఇచ్చిన వారిని కంపెనీలోకి ఆహ్వానం పలకడానికి కాస్త ఆలస్యం అవుతోంద’ని మానవ వనరుల అధిపతి అంగీకరించారు. కానీ ఆఫర్‌ లెటర్‌ అందుకున్న అందరినీ కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. కొద్దికాలంగా ఐటీ కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా.. ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఆలస్యం చేస్తుండడంతో చాలా మంది ఫ్రెషర్లు ఎపుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.


తమ సంస్థలో జాబ్‌ ఆఫర్‌ లెటర్లు పొందిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. టెక్ పరిశ్రమలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, టీసీఎస్‌ మాత్రం ఫ్రెషర్‌లను నియమించుకోవడానికి, వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి కట్టుబడి ఉండం విశేషం.


2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం.. టీసీఎస్‌ 44,000 మంది ఫ్రెషర్‌లకు జాబ్ ఆఫర్‌లను అందించింది. ఈ జాబ్ ఆఫర్‌లను అన్నింటినీ తాము గౌరవిస్తామని, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. 


ఉద్యోగుల వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి టీసీఎస్‌ ప్రయత్నాలను ప్రకటించింది. జూనియర్‌ ఉద్యోగులు తమ నైపుణ్యం పెంచుకుని జీతాలను రెట్టింపు చేసుకునే అవకాశాలను కల్పించనున్నట్లు గతంలోనే వెల్లడించింది. ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకుని తమ కెరీర్‌లో ముందుకు సాగేలా అంతర్గత శిక్షణ అందించాలని సంస్థ నిర్ణయించింది. ఈ శిక్షణలో వివిధ స్థాయిల నుంచి వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ శిక్షణలో ప్రతిభ చూపి అసెస్‌మెంట్‌లను క్లియర్ చేసిన ఉద్యోగులు తమ జీతాలను రెట్టింపు చేసుకునే వీలుంటుంది. అయితే ఈ అసెస్‌మెంట్‌లలో సంవత్సరానికి కేవలం 10 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 


టీసీఎస్ ఫ్రెషర్‌లకు వేతనాలను పెంచడంతోపాటు జూనియర్ స్థాయిల్లోని ఉద్యోగులకు 100 శాతం త్రైమాసిక వేరియబుల్ వేతనం అందించడాన్ని కూడా పరిశీలిస్తోంది. అయితే ఈ జీతాల పెరుగుదల ఎప్పటి నుంచి ఉంటుందో వెల్లడించలేదు. ఒకేసారి ఉద్యోగుల జీతాలు పెంచడం కన్నా శిక్షణ కార్యక్రమాలు అమలు చేసి ప్రతిభావంతులకు జీతాలు పెంచడం మెరుగైన వ్యూహంగా తెలుస్తోంది.


ALSO READ:


సీజీఎల్‌ఈ-2023 'టైర్-1' అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. రీజియన్లవారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సీజీఎల్‌ 'టైర్‌-1' పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial