తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా బ్యాంకు శాఖల్లో క్రెడిట్ అనలిస్ట్, చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 13 చివరితేదీగా నిర్ణయించారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
1) క్రెడిట్ అనలిస్ట్ (స్కేల్-2)
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(ఫైనాన్స్, అకౌంటింగ్) ఉత్తీర్ణతతో పాటు కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఎంబీఏ, సీబీసీఏ ప్రోగ్రామ్ అర్హతలున్నవారికి ప్రాధాన్యం.
అనుభవం: 2 సంవత్సరాలు.
వయసు: 30.06.2023 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
2) చీఫ్ రిస్క్ ఆఫీసర్
అర్హతలు..
* సీఎఫ్‌ఏ ఇన్‌స్టి్ట్యూట్ నుంచి చార్టర్ అవార్డు పొందిన ఛార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అయి ఉండాలి. (లేదా) ఐసీఏఐ బోర్డు గుర్తింపు పొందిన ఛార్టర్ట్ అకౌంటెంట్ అయి ఉండాలి. (లేదా) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ అర్హత ఉండాలి.
* డిగ్రీతోపాటు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ (ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్) ఉండాలి. (లేదా) పీఆర్‌ఎంఐఏ ఇన్‌స్టిట్యూట్ నుంచి ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్టిఫికేట్ ఉండాలి.
అనుభవం: 2 సంవత్సరాలు.
వయసు: 30.06.2023 నాటికి 60 సంవత్సరాలకు మించకూడదు.
3) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్
అర్హతలు..
* నిబంధనల మేరకు విద్యా్ర్హతలు ఉండాలి.
అనుభవం: బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగాల్లో 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాలు ప్లానింగ్/బిజినెస్ డెవలప్‌మెంట్/అడ్వాన్సెస్/ కంప్లయన్స్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 55 సంవత్సరాలలోపు ఉండాలి.
4) చీఫ్ మేనేజర్-క్రెడిట్
అర్హత: డిగ్రీ/పీజీ డిగ్రీతోపాటు సీఏ/సీఎఫ్‌ఏ/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ.
అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.
వయోపరిమితి: 31.5.2023 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 13.08.2023.
Credit Analyst Posts:
Notification
Online Application
Chief Risk Officer:
Notification
Online Application
Chief Operating Officer (COO):
Notification
Online Application
Chief Manager - Credit:
Notification
Online Application
ALSO READ:
1207 'స్టెనోగ్రాఫర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2023 ప్రకటనను ఆగస్టు 2న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
3049 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..