సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా రిజిస్ట్రీ విభాగంలో కోర్టు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 31తో గడువు ముగియనుంది. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, టెక్నికల్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


వివరాలు..


* కోర్టు అసిస్టెంట్ పోస్టులు 


ఖాళీల సంఖ్య: 11


అర్హతలు: బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని, నింపాలి. నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్), టెక్నికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రాక్టికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.


జీతం: నెలకు రూ.80,803.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:


Registrar (Recruitment),


Supreme Court of India,


Tilak Marg, New Delhi-110001. 



ముఖ్యమైన తేదీలు..


* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.12.2022.


* దరఖాస్తుకు చివరితేది: 31.12.2022. 


Notification & Application


 Website



Also Read:


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 22 నుంచి జనవరి 21లోగా దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఐవోసీఎల్‌లో 1746 అప్రెంటిస్‌ పోస్టులు, వివరాలు ఇలా!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) రిఫైనరీస్ డివిజన్.. పలు ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్‌ రిఫైనరీల్లో అప్రెంటిస్‌ శిక్షణకు నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 1746 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 3లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల మేళా, 13404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు! 
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...