భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కింది ప్రోగ్రాముల్లో శిక్షణ నిమిత్తం దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్ను అనుసరించి మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్/ జీఎన్ఎంలో డిప్లొమా/ బీపీటీ/ బీఫార్మసీ/ బీఎస్సీ/ బీబీఏ/ పీజీ డిప్లొమా/ పీజీడీసీఏ/ డీఎంఎల్టీ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 23న ప్రారంభంకానుంది. అభ్యర్థులు అక్టోబరు 8 వరకు తమ ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
* మొత్తం ఖాళీలు: 200.
1) మెడికల్ అటెండెంట్ ట్రైనింగ్: 100
2) క్రిటికల్ కేర్ నర్సింగ్: 20
3) అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనింగ్ (ASNT): 40
3) డేటా ఎంట్రీ ఆపరేటర్/మెడికల్ ట్రాన్‌స్క్రిప్షన్: 06
4) మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్: 10
5) హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్: 10
6) ఓటీ/అనస్తీషియా అసిస్టెంట్ ట్రైనింగ్: 05
7) అడ్వాన్స్‌డ్ ఫిజియోధెరపీ ట్రైనింగ్: 03
8) రేడియోగ్రాఫర్ ట్రైనింగ్: 03
9) ఫార్మసిస్ట్ ట్రైనింగ్: 03
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్ను అనుసరించి మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్/ జీఎన్ఎంలో డిప్లొమా/ బీపీటీ/ బీఫార్మసీ/ బీఎస్సీ/ బీబీఏ/ పీజీ డిప్లొమా/ పీజీడీసీఏ/ డీఎంఎల్టీ/ ఎంబీఏ ఉత్తీర్ణత.
స్టైపెండ్: నెలకు రూ.7,000 - రూ.17,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.09.2022.
దరఖాస్తు చివరి తేది: 08.10.2022.
Also Read:
SSC CGL Notification: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడంచెల (టైర్-1,టైర్-2, టైర్-3) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్ , దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి...
Also Read:
UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా!
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
BHEL: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.దీని ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..