SBI PO Job Notification 2025: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న వాళ్లకు ఇది మంచి అవకాశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 541 పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 14, 2025 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు sbi.co.in లేదా నేరుగా రిజిస్ట్రేషన్ పోర్టల్ ibpsonline.ibps.in/sbipomay25/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 541 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 500 రెగ్యులర్ కేటగిరీకి చెందినవి. 41 పోస్టులు బ్యాక్‌లాగ్ అంటే గత రిక్రూట్‌మెంట్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఉన్నాయి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

అర్హత గురించి మాట్లాడితే, అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయోపరిమితి

దరఖాస్తు చేసుకునే చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్ చేసిన కేటగిరీ (SC, ST, OBC) అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుం ఎంత?

ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి. జనరల్, OBC, EWS కేటగిరీలకు రుసుము రూ. 750. SC, ST, PwD కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు. రుసుమును ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు.

పరీక్ష అండ్‌ ఎంపిక ప్రక్రియ

  • ప్రిలిమినరీ పరీక్ష (Prelims)
  • మెయిన్స్ పరీక్ష (Mains)
  • ఇంటర్వ్యూ (Interview) లేదా గ్రూప్ డిస్కషన్

ప్రతి దశను పాస్ అవ్వడం తప్పనిసరి. తుది ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష + ఇంటర్వ్యూలో మొత్తం పనితీరు ఆధారంగా జరుగుతుంది. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

  • దశ 1: అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ పోర్టల్ ibpsonline.ibps.in/sbipomay25/ని సందర్శించండి.
  • దశ 2: “Click here for New Registration”పై క్లిక్ చేసి, మీ ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి.
  • దశ 3: తరువాత, దరఖాస్తు ఫారమ్‌లో వివరాలను పూరించండి, ఫోటో సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
  • దశ 4: ఇప్పుడు, రుసుము చెల్లించి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • దశ 5: చివరగా, అభ్యర్థులు ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.