Mother murder case: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని NLB నగర్ లో సట్ల అంజలి అనే మహిళ హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక పగిల్ల శివ అనే యువకుడితో కలిసి తల్లిని చంపింది.
ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. బాలిక మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగ్గా చూసుకోవడం లేదని ఆ బాలిక ఫీలవుతోంది. రెండో భర్తకు జన్మించిన చిన్న కూతురుని మాత్రం బాగా చూసుకుంటుందని.. తనని చిత్రహింసలు పెడుతుందని భావిస్తోంది. అదే విషయంపై 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోంలో బాలిక. తర్వాత ఒప్పించి ఇంటికి తీసుకు వచ్చారు.
తర్వాత పదో తరగతి నాటికి బాలిక ప్రేమలో పడింది. కూతురు ప్రేమను.. తల్లి ఒప్పుకుంది. కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో శివ బయటకు వెళ్లిపోయాడు. శివతో పాటు బాలిక కూడా వెళ్లిపోయింది. ఆ తర్వాత పోలీసు కేసు నమోదు అయింది. బాలిక తిరిగి వచ్చి తన.. తల్లి బతికి ఉంటే.. తమను కలవనివ్వదని .. హత్యకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
అంజలిని చంపడం కరెక్టేనన్న నిందితుడి తల్లి
అంజలిని హత్య చేయడాన్ని సమర్థిస్తూ శివ తల్లి సంతోషి ఓ మీడియా చానల్ తో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెనే కారణం మా కొడుకు జీవితం నాశనం కావడానికి... ఆమెను చంపడం తప్పు కాదని చెప్పారు. ఈ రోజు కాదు రేపైనా నా కొడుకులను బయటకు తెచ్చుకుంటానన్నారు. అసలు విషయం మృతురాలి కూతురికే తెలుసు. ఆమెను విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తుందనే ఉద్దేశంతోనే తల్లిని హత్య చేసినట్లు నిందితురాలైన బాలిక విచారణలో అంగీకరించింది. ముగ్గురు నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
మృతురాలు అంజలికి మొదటి భర్త ద్వారా కుమార్తె ఉన్నారు. ఆయన చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో భర్త ద్వారా మరో కుమార్తె జన్మించారు. అయితే ఆయన కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దాంతో ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ అంజలి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. చిన్న కుమార్తెను బాగా చూసుకుంటూ.. తనను సరిగ్గా చూసుకోవడం లేదని పెద్ద కుమార్తె మనుసులో బలంగా నాటుకుపోయింది. ఈ విషయాన్ని గుర్తించలేకపోయిన తల్లి..నిర్లక్ష్యం చేయడంతో అది ఇతరులు ఎవరైనా కొద్దిగా ప్రేమ చూపగానే.. అదే నిజమైన ప్రేమ అనుకుని ఆకర్షితురాలయినట్లుగా తెలుస్తోంది. చివరికి ఆ ప్రేమే తల్లి హత్యకు కారణం అయింది. ఇప్పుడు అంజలి చిన్న కూతురు అనాథ అయింది.