ముంబ‌యి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్& ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. డిగ్రీ, ఎంబీఏ(ఫైనాన్స్)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్(ఫైనాన్స్)/ సీఏ/ సీఎఫ్ఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి.. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.


వివరాలు..


* మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్)


మొత్తం ఖాళీలు: 55 పోస్టులు


అర్హత: డిగ్రీ, ఎంబీఏ(ఫైనాన్స్)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్(ఫైనాన్స్)/ సీఏ/ సీఎఫ్ఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30.06.2022 నాటికి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: నెలకు రూ.63840-రూ.78230.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం: పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు ఉంటాయి.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభతేది: 22.11.2022


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 12.12.2022.


Notification 


Online Application


Website 


Also Read:


ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 800 ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులు
న్యూఢిల్లీ ప్రధాన‌కేంద్రంగా పనిచేస్తున్న ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఆర్డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి...


ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2521 అప్రెంటీస్ ఖాళీలు - టెన్త్‌తోపాటు ఐటీఐ అర్హత ఉండాలి!
RRC-West Central Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- వెస్ట్ సెంట్రల్ రైల్వే 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధింత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...