SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్‌ ఫారెక్స్‌ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు జూన్ 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 150


* ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-II)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-స్కేల్ II: 150 పోస్టులు


అర్హతలు: ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్‌ ఫారెక్స్‌ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 31.12.2023 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.


పే స్కేల్: నెలకు రూ.48,170-రూ.69,810.


పోస్టింగ్ స్థలం: హైదరాబాద్, కోల్‌కతా. 


దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం:  షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


అప్‌లోడ్ చేయాల్సిన డాక్యూమెంట్స్..


➥ రీసెంట్ ఫొటోగ్రాఫ్.


➥ సిగ్నేచర్.


➥ డిటైల్డ్ రెజ్యుమ్ (పీడీఎఫ్).


➥ ఐడి ప్రూఫ్ (పీడీఎఫ్).


➥ పుట్టిన తేదీ రుజువు (పీడీఎఫ్).


➥ కాస్ట్ సర్టిఫికేట్, (వర్తిస్తే) (పీడీఎఫ్).


➥ దివ్యాంగ సర్టిఫికేట్(వర్తిస్తే) (పీడీఎఫ్).


➥ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్-షీట్లు/ డిగ్రీ సర్టిఫికేట్ (పీడీఎఫ్).


➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ (పీడీఎఫ్).


➥ ఫారం-16/ఆఫర్ లెటర్/ప్రస్తుత యజమాని నుంచి లేటెస్ట్ పే స్లిప్ (పీడీఎఫ్).


➥ ప్రస్తుత యజమాని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తప్పనిసరి( ప్రభుత్వ సంస్థ/పబ్లిక్ సెక్టార్ యూనిట్/పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో పని చేస్తున్నట్లయితే)


ముఖ్యమైనతేదీలు..


✦ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 07.06.2024.


✦ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరితేదీ: 27.06.2024.


Notification


Website


ALSO READ:


ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ సంక్షిప్త ప్రకటన విడుదల, ముఖ్యమైన తేదీలివే
IBPS RRB Recruitment 2024:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS), రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(RRB)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII (CRP) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి జూన్ 6న సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ తదితర బ్యాంకుల్లో  గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీచేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ జూన్ 7 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ఆన్‌లైన్‌ పరీక్షలతోపాటు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకుIBPS  అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ జూన్‌ 7న విడుదల కానుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా జూన్‌ 7 నుంచే ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్‌ 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..