Jagan Meet With Candidates :  ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి వైసీపీ అధినేత జగన్ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్లీ గట్టిగా నిలబడతామని చెప్పిన ఆయన.. వెంటనే పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఇంత వరకూ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఉన్న ఇంటినే పార్టీ ఆఫీసుగా మార్చారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు. మరో చోట పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతున్నప్పటికీ.. పార్టీ ఆఫీసును తమ పాత క్యాంప్ ఆఫీసులోకే మార్చాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు.


జగన్ నివాసానికి వస్తున్న  పోటీ చేసిన అభ్యర్థులు                          


వివిధ ప్రాంతాల నుంచి పార్టీ తరపున పని చేసిన పలువురు అభ్యర్థులు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వస్తున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ఉత్తరాంధ్ర నేతలు పార్టీ కార్యాలయానికి వచ్చారు. వారితో జగన్ మాట్లాడారు. బొత్స సత్యనారాయణ సహా ఆయన కుటుంబీకులు అంతా ఓడిపోయారు.  బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన సోదరుడు  బొత్స అప్పలనర్సయ్య, సమీప బంధువు అప్పల్నాయుడు కూా ఓడిపోయారు. ఈ ఘోర పరాజయానికి కారణాలేమిటన్నదానిపై జగన్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.


పూర్తిస్థాయి సమీక్ష త్వరలో ఉంటుందన్న  నేతలు                           


ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారితోనూ జగన్ మాట్లాడుతున్నారు. జిల్లాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. అయితే ఇది ఓటమిపై పూర్తి స్థాయిలో చేస్తున్న నసమీక్ష కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తర్వాత జిల్లాల వారీగా ఓటమిపై జగన్ సమీక్ష నిర్వహిస్తారని అంటున్నారు. అధికారంంలో ఉండి.. పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చిన తర్వాత యాభై నుంచి నలభై శాతానికి ఓట్లు పడిపోవడంపై కూడా చర్చిస్తున్నారు.


బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న  కొంత మంది నేతలు                                     


మరో వైపు పార్టీ నేతలు ఎక్కువ మంది సీఎంవో అధికారులు, వాలంటీర్లు, ఐ ప్యాక్, ఆరా సర్వే సంస్త అధినేత మస్తాన్ వల్ల ఓడిపోయామని అంటున్నారు. ఇదంతా బహిరంగగా చెబుతున్నారు. వీరెవరూ ఇలాంటి కారణాలపై బహింగవేదికలపై మాట్లాడవద్దని.. పార్టీ అంతర్గత వేదికపై మాట్లాడాలని సందేశం పంపుతున్నారు. అయినా కొంత మంది పార్టీ కార్యకర్తల సమావేశాల్లో తమ వాదన వినిపిస్తూనే ఉన్నారు. 


ఎన్నికలు అయిపోయిన తర్వాత తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల విషయంలో  జగన్ ఆగ్రహంగా ఉన్నారు.  ఈ విషయంలో న్యాయపోరాటం చేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. నియోజకవర్గానికో లాయర్ కు బాధ్యతలు అప్పగించారు.