Staff Nurse Certificate Vrification: తెలంగాణలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి డిసెంబరు 30 నుంచి జనవరి 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను MHSRB పూర్తిచేసింది. అభ్యర్థులను 1 : 1.25 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపికచేసింది. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాకపోయినా, కావాల్సిన పత్రాల్లో ఏవైనా సమర్పించకపోయినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 8892 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 40 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆగస్టు 7న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్సర్ 'కీ' అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని డిసెంబరు 18న తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను MHSRB విడుదల చేసింది. తాజాగా అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసింది.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలు ఇలా..
➥ డిసెంబరు 30న - 1200 మంది అభ్యర్థులకు
➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 400
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 400
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 400.
➥ జనవరి 1న - 1350 మంది అభ్యర్థులకు
➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 450
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 450
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 450.
➥ జనవరి 2న - 1500 మంది అభ్యర్థులకు
➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.
➥ జనవరి 3న - 1500 మంది అభ్యర్థులకు
➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.
➥ జనవరి 4న - 1500 మంది అభ్యర్థులకు
➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.
➥ జనవరి 5న - 1500 మంది అభ్యర్థులకు
➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500
➨ రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 3.00 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 500.
➥ జనవరి 6న - 342 మంది అభ్యర్థులకు
➨ రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.15 గంటలకు.
హాజరుకానున్న అభ్యర్థులు: 342
ప్రొవిజినల్ మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
సికింద్రాబాద్ - ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు
సికింద్రాబాద్ ఆర్.కె.పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 62 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్(టీజీటీ), ప్రైమరీ టీచర్స్(పీఆర్‌టీ), ప్రీ ప్రైమరీ టీచర్స్, హెడ్ మిస్ట్రెస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..