Army Public School Recruitment: సికింద్రాబాద్ ఆర్.కె.పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 62 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్(టీజీటీ), ప్రైమరీ టీచర్స్(పీఆర్‌టీ), ప్రీ ప్రైమరీ టీచర్స్, హెడ్ మిస్ట్రెస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 62.
➥ పీజీటీ (9 - 12వ తరగతులకు): 05 పోస్టులు
సబ్జెక్టులు: కెమిస్ట్రీ, సైకాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, పీఈటీ.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
➥ టీజీటీ (6 - 10వ తరగతులకు): 30 పోస్టులు
సబ్జెక్టులు: హిందీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్ సైన్స్, సీఎస్, పీఈటీ, సంస్కృతం, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్పెషల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
➥ పీఆర్‌టీ (1 - 5వ తరగతులకు): 16 పోస్టులు
సబ్జెక్టులు: అన్ని సబ్జెక్టులతో పాటు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్-, పీఈటీ, డ్యాన్స్, కౌన్సెలర్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
➥ ప్రీ ప్రైమరీ టీచర్స్ (నర్సరీ - యూకేజీ): 09 పోస్టులు
అర్హత: సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ/ఎన్‌ఐఓఎస్ బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీంతోపాటు 50 శాతం మార్కులతో నర్సరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్సు లేదా డిప్లొమా(ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
➥ హెడ్ మిస్ట్రెస్ (ఏపీఎస్ ఆర్కేపురం ప్రీప్రైమరీ వింగ్): 02 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ(ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/NTT) అర్హత ఉండాలి. స్కూల్ హెడ్‌మిస్ట్రెస్/కోఆర్డినేటర్/సూపర్‌వైజర్‌గా కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 55 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Principal,
Army Public School,
RK Puram, Secunderabad.
దరఖాస్తుకు చివరితేది: 15.01.2023.
ALSO READ:
సాలార్‌జంగ్ మ్యూజియంలో గ్రూప్-ఎ, బి, సి పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో గ్రూప్-ఎ, బి, సి పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో క్యూరేటర్, డిప్యూటీ క్యూరేటర్, అకౌంటెంట్, సీనియర్ ఫొటోగ్రాఫర్, గ్యాలరీ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మ్యూజియంలో ఉద్యోగాల భర్తీకి గతంలో జారీ అయిన నోటిఫికేషన్లకు (3/2015, 6/2017, 8/2017, 2/2019, 04/2019) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తుల చేసుకోవాల్సిన అవసరంలేదు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.