కేంద్రప్రభుత్వ విభాగాల్లో మల్టీటాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి నిర్వహించిన టైర్-1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 8న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంటీఎస్ టైర్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. 


మల్టీటాస్కింగ్ స్టాఫ్ టైర్-1 పరీక్షలో మొత్తం 69,160 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 44,590 మంది అభ్యర్థుల మల్టీటాస్కింగ్ పోస్టులకు; 24,570 మంది అభ్యర్థులు హవల్దార్ పోస్టులకు సంబంధించి తదుపరి దశకు ఎంపికైన అభ్యర్థులు ఉన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 5 నుంచి 22 వరకు ఎంటీఎస్ (నాన్ టెక్నికల్) టైర్-1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 


అభ్యర్థుల స్కోరుకార్డులను అక్టోబరు 17 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. నవంబరు 6 వరకు స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఐడీకార్డు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు పొందవచ్చు.  



ఫలితాలు, కటాఫ్ మార్కులకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..



SSC MTS Tier 1 Result ఇలా చూసుకోండి..

Step 1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - ssc.nic.in.

Step 2. అక్కడ హోంపేజీలో ఫలితాలకు సంబంధించిన టాబ్ మీద క్లిక్ చేయాలి.

Step 3. SSC MTS Tier 1 Result 2022 లింక్ మీద క్లిక్ చేయాలి.

Step 4. SSC MTS 2022 టైర్-1 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది. 

Step 5. అభ్యర్థులు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫలితాలు చూసుకోవచ్చు. 



SSC MTS Tier-1 Result

SSC Havaldar Tier-1 Result



Also Read:


ECIL: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..



ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 ఖాళీలు, దరఖాస్తుకు అర్హతలివే!

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్స్‌, ప్యారామీటర్స్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...