యాపిల్ ఇటీవలే లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.. ఐఫోన్ 13 కంటే మెరుగైన బ్యాట‌రీ లైఫ్, మంచి కెమెరాలతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఐఫోన్ 14 ప్లస్‌లో ఏ15 బయోనిక్ చిప్‌ను అందించారు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన సేల్ సెప్టెంబర్‌లోనే ప్రారంభం అయింది.


ఐఫోన్ 14 ప్లస్ ధ‌ర‌
ఇందులో 128 జీబీ వేరియంట్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. 256 జీబీ వేరియంట్ ధర రూ.99,900 కాగా, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,19,900గా ఉంది. బ్లూ, పర్పుల్, స్టార్ లైట్, మిడ్‌నైట్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.


దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?