కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(టైర్-2)-2022 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 30న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టైర్-2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ 'కీ' సరిచూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీతోపాటు, రెస్పాన్స్ షీట్లను పొందవచ్చు. అభ్యర్థులకు ఆన్సర్ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే అక్టోబరు 30న సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 1న సాయంత్రం 6 గంటల వరకు తెలపాల్సి ఉంటుంది.


సీజీఎల్ 2023 టైర్-2 ఆన్సర్ 'కీ'  కోసం క్లిక్ చేయండి...


కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు సంబంధించిన టైర్-2 సీబీటీ పరీక్షల అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 21న విడుదల చేయగా... ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో టైర్‌-2 పరీక్షలు నిర్వహించింది. జులై 14 నుంచి 27 వరకు నిర్వహించిన టైర్‌-1 పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 19న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఫలితాల్లో మొత్తం 81,695 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి 'టైర్‌-2' పరీక్షలు నిర్వహించారు. టైర్-2 పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి తుది ఎంపిక చేయనున్నారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది. 


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఏడాది ఏప్రిల్ 3న సీజీఎల్-2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ సమయంలో మొత్తం 7,500 ఖాళీలు ప్రకటించగా.. తాజాగా ఆ సంఖ్యను 8,440కు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అదనంగా 940 పోస్టులు చేరినట్లయింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.





ఖాళీల సంఖ్య: 8,400


➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్


➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్


➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్


➥ అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్


➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్


➥ ఇన్‌స్పెక్టర్ - సెంట్రల్ ఎక్సైజ్


➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)


➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్


➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)


➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)


➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)


➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్


➥ రిసెర్చ్ అసిస్టెంట్ (సీబీఐసీ, NHRC)


➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)


➥ సబ్ ఇన్‌స్పెక్టర్  (NIA)


➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)


➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)


➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,)


➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)


➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్


➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)


➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్


➥ ట్యాక్స్ అసిస్టెంట్


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..