SSC GD Constable Recruitment Exam City: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ ఖాళీల నియామక రాతపరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) జనవరి 6న విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి పరీక్ష కేంద్రం, అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థుల రూల్‌ నంబర్‌, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు తదితర వివరాలు ఇందులో ఉంటాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షక సంబంధించిన అడ్మిట్‌ కార్డులను త్వరలోనే విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

సదరన్ రీజియన్ అప్లికేషన్ స్టేటస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష కేంద్రం వివరాల కోసం క్లిక్ చేయండి..

కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 24న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 24 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. వయసు 18 - 23 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి దరఖాస్తులు సమర్పించారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 6174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 11025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్‌(SSB)లో 635 పోస్టులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,189 పోస్టులు, అస్సాం రైఫిల్స్(AR)లో 1,490 పోస్టులు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 296 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు. 

రాత పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంటలిజెన్స్‌ & రీజనింగ్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవర్‌నెస్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు. 

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 26,146

పోస్టుల కేటాయింపు: యూఆర్-10,809, ఈడబ్ల్యూఎస్-3633, ఓబీసీ-5360, ఎస్టీ-2602, ఎస్సీ-3742.

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 6174 మెన్-5211, ఉమెన్-963
సీఐఎస్‌ఎఫ్‌ 11025 మెన్-9913, ఉమెన్-1112
సీఆర్‌పీఎఫ్‌ 3337 మెన్-3266, ఉమెన్-71
ఎస్‌ఎస్‌బీ 635 మెన్-593, ఉమెన్-42
ఐటీబీపీ 3189 మెన్-2694, ఉమెన్-495
ఏఆర్ 1490 మెన్-1448, ఉమెన్-42
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 296 మెన్-222, ఉమెన్-74
మొత్తం ఖాళీలు 26,146 26,146

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...