ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించి పేపర్‌-1 (కంప్యూటర్ ఆధారిత) ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 25న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం మూడు జాబితాల్లో ఫలితాలను పొందుపర్చింది. మొదటి జాబితాలో పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు, రెండో జాబితాలో పురుషులు, మూడో జాబితాలో డిపార్ట్‌మెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను పొందిపరిచారు. మూడు జాబితాల నుంచి మొత్తం 31,368 మంది ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు.


Cutoff Marks Details


LIST OF FEMALE CANDIDATES QUALIFIED IN PAPER-I 


LIST OF MALE CANDIDATES QUALIFIED IN PAPER-I 


LIST OF DEPARTMENTAL CANDIDATES OF DELHI POLICE QUALIFIED IN PAPER-I


పేపర్‌-1 పరీక్షలో 2607 మంది మహిళలు అర్హత సాధించగా.. 28,633 మంది పురుష అభ్యర్థుల అర్హత సాధించారు. ఇక ఢిల్లీ పోలీసు విభాగం నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు (పీఈటీ/ పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైతే నెలకు రూ.35,400-రూ.1,12,400 జీతం అందుతుంది.


ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 22న నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసిన సంగతి తెలిసిందే. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబరు 3 నుంచి 5 వరకు రాతపరీక్ష నిర్వహించారు. దీనిద్వారా బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌‌లో ఖాళీలను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. 


ఫిజికల్ ఈవెంట్లు ఇలా..
ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థుల శారీరక ప్రమాణాలు (ఎత్తు, ఛాతీ), లాంగ్ జంప్, హైజంప్, షార్ట్​పుట్ నిర్వహిస్తారు. 


పేపర్-2 పరీక్ష విధానం
 మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారితంగా పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు వర్తిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు 025 మార్కులు కోత విధిస్తారు.


డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్..
అన్ని దశలు దాటుకుంటూ వచ్చిన అభ్యర్థులకు చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీఎంఈ (డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్) నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


రైల్‌టెల్ కార్పొరేషన్‌లో 81 అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు- అర్హతలివే
న్యూఢిల్లీలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 11లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1200 చెల్లించాలి. అయితే వఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. రాత పరీక్ష/ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


రాష్ట్రీయ కెమికల్స్‌ & ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 408 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..