స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(సీహెచ్ఎస్ఎల్) 2020 తుది ఫలితాలు డిసెంబర్ 7న విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో 4791 లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తదితర పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. టైర్-1, టైర్-2, స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఈ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
మొత్తం 4685 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, ఎంపికకాని అభ్యర్థుల పూర్తి మార్కుల వివరాలు డిసెంబర్ 14న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు కమిషన్ తెలిపింది. ఈ వివరాలు డిసెంబర్ 28 వరకు అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ - 2020 స్కిల్‌టెస్ట్‌ను జులై 1న నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను అక్టోబర్ 18న కమిషన్ విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ నిర్ణయించిన కటాఫ్ (డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్) ఆధారంగా 247 మంది, టైపింగ్ టెస్ట్ ఆధారంగా 11297 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. మొత్తం 11,544 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అర్హులయ్యారు.
సీహెచ్‌ఎస్ఎల్ టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) పరీక్ష ఈ ఏడాది జనవరి 9న జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 45,480 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీటికి సంబంధించిన ఫలితాలు మే 13న విడుదలయ్యాయి. ఇక తదుపరి ఘట్టమైన స్కిల్ టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. టైర్-I, టైర్-IIలలో కమిషన్ కట్-ఆఫ్ ప్రకారం.. మొత్తం 28,133 మంది అభ్యర్థులు DEST/టైపింగ్ పరీక్షకు హాజరుకాగా.. 11,544 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అర్హత సాధించారు. అనంతరం 4685 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
Also Read:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 551 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ప్రధాన కార్యాలయం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 551 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్ఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పోస్టును అనుసరించి 32-45 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబరు 23లోగా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..