బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ప్రధాన కార్యాలయం వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 551 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్ఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పోస్టును అనుసరించి 32-45 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబరు 23లోగా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 551
1. ఏజీఎం బోర్డ్ సెక్రటరీ కార్పొరేట్ గవర్నెన్స్: 1 పోస్టు
2. ఏజీఎం- డిజిటల్ బ్యాంకింగ్: 1 పోస్టు
3. ఏజీఎం- మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్: 1 పోస్టు
4. చీఫ్ మేనేజర్- మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎంఐఎస్): 1 పోస్టు
5. చీఫ్ మేనేజర్- మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్: 1 పోస్టు
6. చీఫ్ మేనేజర్- డిజిటల్ బ్యాంకింగ్: 02 పోస్టులు
7. చీఫ్ మేనేజర్- ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్: 1 పోస్టు
8. చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్: 1 పోస్టు
9. చీఫ్ మేనేజర్- క్రెడిట్: 15 పోస్టులు
10. చీఫ్ మేనేజర్- డిజాస్టర్ మేనేజ్‌మెంట్: 1 పోస్టు
11. చీఫ్ మేనేజర్- పబ్లిక్ రిలేషన్ & కార్పొరేట్ కమ్యూనికేషన్: 1 పోస్టు
12. జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్-2: 400 పోస్టులు
13. జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్-3: 100 పోస్టులు
14. ఫారెక్స్/ట్రెజరీ ఆఫీసర్: 25 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్ఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టును అనుసరించి 32-45 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభతేదీ: 06.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.12.2022
Also Read:
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 213 ఉద్యోగాలు, వివరాలు ఇవే!
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా జేవో&జేఎస్, సిర్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి డిప్లొమా(మైనింగ్/ మైనింగ్ ఇంజినీరింగ్/ మైన్ సర్వేయింగ్)/ డిగ్రీ(సివిల్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.