Horoscope Today 8th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి
ధ్యానంతో మీరు శాంతిని పొందుతారు. కేసులలో ఇరుక్కుపోయిన వారికి మరిన్ని ఇబ్బందులుంటాయి. ఖర్చుల భారం మీ మనస్సుపై ఉంటుంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేలా పిల్లలను ప్రోత్సహించండి.అద్భుతాలు ఆశించవద్దు.. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 


వృషభ రాశి 
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. హార్ట్ వర్క్ చేస్తేనే ఫలితం పొందుతారు. ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. అనుకున్న ప్రకారం పనులు పూర్తి చేయడం ద్వారా మీ జీవితభాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


మిధున రాశి
మిధున రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో పేరుప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి రంగంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ పాత స్నేహితులను కలవవచ్చు.


కర్కాటక రాశి
ఈ రోజు మీలో భావోద్వేగాలను బయటకు తీయండి. ఎప్పటి నుంచో మోస్తున్న భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ రూపంలో ప్రయోజనాలను పొందుతారు. మీ ఇంటి వాతావరణంలో ఏవైనా మార్పులు చేయడానికి ముందు మీరు ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.


Also Read:  అనసూయ మహా పతివ్రత ఎందుకంటే!


సింహ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తిచేస్తారు. కార్యాలయంలోని సీనియర్లతో మాట్లాడటం మీకు సహాయపడుతుంది. కుటుంబ సమస్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు మంచి రోజు. ఇంట్లో అందరితో సామరస్యం నెలకొంటుంది.


కన్యా రాశి
ఈ రోజు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవితంలో జరిగే మార్పులను మీరు అంగీకరించాలి. ఈ రోజు మీరు ఆలోచనా పరమైన వ్యక్తులను కలువుతారు. స్నేహితుల గురించి మాట్లాడటం ద్వారా మీ సమయాన్ని వృథా చేయవద్దు.


తులా రాశి 
కొంతమంది కుటుంబ సభ్యులు అసూయ స్వభావం కారణంగా మీకు చిరాకు కలిగించవచ్చు. కానీ మీరు సహనాన్ని కోల్పోవద్దు. లేదంటే పరిస్థితి అదుపు తప్పుతుంది. మెరుగుపరచలేని వాటిని అంగీకరించడం మంచిది.


వృశ్చిక రాశి
ఈ రోజు మీకు బావుంటుంది. మీరు చాలా రోజులుగా వెతుకుతున్న అవకాశం ఈ రోజు నెరవేరుతుంది. మీరు మీకు దగ్గరగా ఉన్నవారి నుంటి సహాయం పొందుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఈ రోజు శుభదినం.


Also Read: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె


ధనుస్సు రాశి
ఈ రోజు మీరు మీ పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేదా కొత్త పరికరాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ధనుస్సు రాశికి చెందిన అవివాహిత వ్యక్తులు శుభవార్త అందుకుంటారు, త్వరలోనే మీ జీవితంలోకి కొత్త భాగస్వామి రావచ్చు.


మకర రాశి 
అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మీ పెట్టుబడులు, భవిష్యత్తు ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. ఒకరి మాటలను మరొకరు అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ వివాదాలను వేరేవారి ముందు ఉంచొద్దు...అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. 


కుంభ రాశి 
ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి ఇది మంచి రోజు. మీరు ఒక పెద్ద బాధ్యతను పొందవచ్చు...దాన్ని బాగా నేరవేరుస్తారు. ఈ రాశి కళాకారులకు మంచి రోజు. 


మీన రాశి
ఈ రోజు మీరు భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలను రూపొందించవచ్చు. మీరు ఒకరి పట్ల ఆకర్షితులవుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి రోజు. అవసరం అయినవారికి సహాయం చేస్తారు. మీరు మీ జీవితంలో వేగంగా ముందుకు సాగుతారు.