కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామినేషన్‌ (సీజీఎల్‌ఈ)-2022 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్‌ఎస్‌సీ) మే 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను నాలుగు జాబితాల్లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో పొందుపరిచింది.


మొదటి జాబితాలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 1462 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు 38 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక మూడో జాబితాలో మిగతా పోస్టులకు 34,484 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మొత్తం 36,001 పోస్టులకు అభ్యర్థులను ఎస్‌ఎస్‌సీ ఎంపికచేసింది. కోర్టు కేసుల కారణంగా 63 మంది అభ్యర్థుల ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెండింగ్‌లో ఉంచింది.


ఎస్‌ఎస్‌సీ గతేడాది డిసెంబర్‌లో సీజీఎల్‌ఈ టైర్‌-1.. ఈ ఏడాది మార్చిలో సీజీఎల్‌ఈ టైర్‌-2 పరీక్షలను దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 36,001 ఏఏవో, జేఎస్‌వో, ఎస్‌ఐ తదితర ఖాళీల భర్తీని ఎస్‌ఎస్‌సీ చేపడుతోంది. మెరిట్ జాబితా, కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులను వెబ్‌సైట్‌లో అభ్యర్థులు చూసుకోవచ్చు.


అభ్యర్థుల కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..


LIST-1: ASSTT AUDIT OFFICER/ASSTT ACCOUNTS OFFICER


LIST-2: JUNIOR STATISTICAL OFFICER


LIST-3: ALL POSTS OTHER THAN AAOs/JSO


ALso Read:


నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 103 నర్స్‌, పారామెడికల్‌ పోస్టులు- అర్హతలివే!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ) నర్స్‌, పారామెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ, హెచ్‌ఎస్‌సీ, 12వ తరగతి, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్‌టీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 12 నుంచి జూన్ 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


వెబ్‌సైట్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్‌టికెట్లు! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.. కాబట్టి, అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు లింకు అందుబాటులో ఉంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..