మే 15 రాశిఫలాలు


మేష రాశి


ఈ రాశి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. పెద్దల మార్గదర్శకత్వం పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఏ పని లేకపోవడం వల్ల అశాంతి ఉంటుంది.


వృషభ రాశి


మీ మాటల్ని నియంత్రించాలి. ఒకరి ప్రవర్తన మీపై ఒత్తిడిని కలిగిస్తుంది. పాత వ్యాధి తిరిగబెట్టే అవకాశం ఉంది జాగ్రత్త. విచారకరమైన వార్తలు వినాల్సి రావొచ్చు. కాస్త ఓపికగా వ్యవహరించాలి..ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. శత్రుత్వం పెరుగుతుంది. కుటుంబంలో ఆందోళన పెరుగుతుంది. నిత్యావసర వస్తువులు సమయానికి అందుబాటులో ఉండవు. 


మిథున రాశి


శత్రువులకు మీచేతిలో ఓటమి తప్పదు. వివాదాలను ప్రోత్సహించవద్దు. అనుకున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆదాయ వనరులలో పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం బాగా సాగుతుంది. గాయం కారణంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. ఏ పనిలోనూ తొందరపడకండి.


కర్కాటక రాశి


ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక ఇబ్బంది, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. సోమరితనం వీడండి. 


Also Read: 786 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి - ముస్లింలు ఆ సంఖ్యను అంతగా ఎందుకు ఆరాధిస్తారు!


సింహ రాశి


ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధనంకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభం ఉంటుంది. చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. పెద్ద సమస్య నుంచి బయటపడతారు. పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. 


కన్యా రాశి


అనవసర ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. రిస్క్ తీసుకోవద్దు. అనకున్న పనులు ఆలస్యం అవుతాయి. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు.రుణ విముక్తి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార యాత్ర విజయవంతమవుతుంది. 


తులా రాశి


ఈ రాశివారు అప్పుల నుంచి బయటపడతారు. వ్యాపార కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఆదాయవనరులు లాభిస్తాయి. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 


వృశ్చిక రాశి 


ఈ రాశివారికి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. పనితీరులో మెరుగుదల ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. భాగస్వాముల సహకారం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలపై నమ్మకం పెరుగుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం విజయవంతమవుతుంది. కళ్లకు సంబంధించిన సమస్య రావొచ్చు. న్యాయపరమైన అడ్డంకి ఉంటుంది.


Also Read: మే మూడో వారంలో ఈ రాశులవారికి ఆస్తి ప్రయోజనాలున్నాయి, మే 15 నుంచి 21 వరకూ వారఫలాలు


ధనుస్సు రాశి  


ఏ తప్పులను సమర్ధించవద్దు.వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.  కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండొచ్చు. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యులనుంచి సహకారం అందుతుంది. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు.


మకర రాశి


ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వివాదాల కారణంగా ఉద్రిక్తత ఉంటుంది. కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది. వాహన వినియోగంలో నిర్లక్ష్యం చేయవద్దు. తెలియని అడ్డంకి ఉండవచ్చు. టెన్షన్ పెరుగుతుంది. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. అనవసర రిస్క్ చేయవద్దు. ఇతరుల వివాదాలలో తలదూర్చకండి.


కుంభ రాశి


ఇంట్లో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది.  వ్యాపారం బాగా సాగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఖర్చులు పెరుగుతాయి.


మీన రాశి


ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూమి, భవనాలు, దుకాణం, కర్మాగారాలు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఉపాధిలో పెరగుదల ఉంటుంది.అపరిచితులను నమ్మొద్దు. సోమరితనం ఉండదు. ఈ రాశివారిది కష్టపడే మనస్తత్వం.