SSC Constable: 'టెన్త్' అర్హతతో కేంద్రంలో కానిస్టేబుల్ కొలువులు - 75,768 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SSC Constable Notification: కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌ మ్యాన్‌, సిపాయ్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

SSC Constable Notification: కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ (Rifle Man), సిపాయ్‌ (Sepoy) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 75,768 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 27,875 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 8,596 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 25,427 పోస్టులు, సశస్త్ర సీమాబల్‌(SSB)లో 5,278 పోస్టులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,006 పోస్టులు, అస్సాం రైఫిల్స్(AR)లో 4,776 పోస్టులు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 583 పోస్టులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)లో 225 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో పురుషులకు 67,364 పోస్టులు, మహిళలకు 8,179 పోస్టులు కేటాయించారు. 

Continues below advertisement

ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 24 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి, డిసెంబరు 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి.  కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  వచ్చేఏడాది(2024) ఫిబ్రవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 75,768

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 27875 మెన్-24806, ఉమెన్-3069
సీఐఎస్‌ఎఫ్‌ 8596 మెన్-7877, ఉమెన్-721
సీఆర్‌పీఎఫ్‌ 25427 మెన్-22196, ఉమెన్-3231
ఎస్‌ఎస్‌బీ 5278 మెన్-4839, ఉమెన్-5278
ఐటీబీపీ 3006 మెన్-2564, ఉమెన్-3006
ఏఆర్ 4776 మెన్-4624, ఉమెన్-152
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 583 మెన్-458, ఉమెన్-125
ఎన్‌ఐఏ 225 మెన్-225
మొత్తం ఖాళీలు 75,768     75,768

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 

వయోపరిమితి: 01.08.2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. 02.08.2000 - 01.08.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్-3 సంవత్సరాలు, అల్లర్లలో భాదిత కుటంబాలకు చెందిన అభ్యర్థులకు  5 - 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానంఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.

దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌ & రీజనింగ్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవర్‌నెస్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24.11.2023.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 28.12.2023. (23:00)

➥ చలానా జనరేట్ చేయడానికి చివరితేది: 28.12.2023 (23:00)

➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.12.2023 (23:00)

➥ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.12.2023.

➥ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 2024 ఫిబ్రవరిలో 

Continues below advertisement
Sponsored Links by Taboola