Krishna Mukunda Murari Serial November 20th Episode : మురారి: వేణిగారు మీరో మాతో పాటు మా ఇంట్లోనే ఉండాలి.. మాట్లాడరేంటి
కృష్ణ: నేను దూరంగా ఏం లేను కదా పిలిస్తే పలికే అంత దగ్గర్లోనే ఉన్నాను కదా
మురారి: పిలిస్తే పలికే అంత దగ్గర్లో కాదు చూస్తే కనపడే అంత దగ్గరగా ఉండాలి అని అంటున్నా
కృష్ణ: మనసులో.. గతం గుర్తొస్తే ఇక్కడే ఉంటాను కదా.. హా.. అదే మీరు అమెరికా వెళ్లొచ్చాక మీకు తప్పకుండా గతం గుర్తొస్తుంది. అప్పుడు ఎలాగూ మీ పక్కనే ఉంటాను కదా.. మీతోనే ఉంటాను హ్యాపీనా.. హ్యాపీగా ఉండండి సార్ మీకేం కాదు. రేపు ఉదయం మళ్లీ వస్తా (బయటకు వచ్చి భవానితో) మేడం మీరు నాతో ఏం చెప్పారు ఏసీపీ సార్ ఏమైనా నిజం చెప్పమంటే చెప్పమన్నారు. కదా నేను అలానే వెళ్లాను మందులు ఇచ్చాను. ఇప్పుడు సార్ ఓకే. నేనుండగా సార్‌ని కంగారు పడనివ్వను. పడితే మీరు పడాలి.
భవాని: రేవతి తనతో మాట్లాడాలి అంటేనే చాలా ఇరిటేటింగ్‌గా ఉంది
రేవతి: అవును.. మేమెందుకు కంగారు పడాలి. (మనసులో) ఈ తింగరి దాన్ని అవుట్ హౌస్‌లోకి వెళ్లి చితకతంతేగానీ బుద్ధి రాదు. ఇదిగో నిన్నే అగుడుతుంది మేమెందుకు కంగారు పడాలి.
కృష్ణ: ఏం లేదు చిన్న మేడం పైకి నేను వెళ్తే నేను నిన్ను చదివించానట కదా అన్నారు. అవును సార్ మీరే చదివించి నన్ను డాక్టర్‌ని చేశాను అన్నారు. అందుకు సార్ ప్రతిలంచంగా సాయం చేయాలి అన్నారు. నేను సరే అంటే అందుకు సార్ మీరు మా ఇంట్లో ఉండాలి అన్నారు. దానికి నేను కుదరదు అన్నాను. మేడం మీ మాట అంటే నాకు గౌరవం.. నేనెప్పుడు జవదాటను ఎప్పుడూ మీ మాట మీదే ఉంటాను తప్పను. ఇక్కడ కొందరు రోజుకొక మాట మాట్లాడుతారు. అసలు నేను ఒక్క మాట ఒక్కేఒక్క మాట అంటే ఏసీపీ సార్‌కి అంతా అర్థమవుతుంది. ఎవరు చెప్పినా వినకుండా నన్ను ఈ ఇంట్లోనే ఉంచేస్తారు. మిమ్మల్ని ఏసీపీ సార్ ముందు అత్తయ్య అని పిలిస్తే చాలు ఖతం. కానీ నేను పిలవడం లేదు. మీ మాటకు విలువిచ్చి పిలవడం లేదు. ఇప్పటికైనా నేనేంటో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వస్తాను
భవాని: ఆగు నా మాటకు విలువిచ్చాను అను అబద్ధం చెప్పకు. అలా పిలిస్తే కనీసం అవుట్ హౌస్‌లో కూడా ఉంచను అనే భయంతో అంత ధైర్యం చేయవు అని నాకు తెలుసు వెళ్లు.
కృష్ణ పిన్ని తన అల్లుడికి ఎలా ఉంది అని కంగారు పడుతుంది. ఇంతలో కృష్ణ వచ్చి అక్కడ జరిగింది చెప్తుంది. మురారికి కృష్ణ గుర్తొస్తున్నాడు అని ఇద్దరూ సంతోషిస్తారు. ఇక తన చిన్నాన్నను కలిసి ఎందుకు ఆ నేరం మీద వేసుకున్నావని అడుగుతానని కృష్ణ అంటుంది. అందుకు మంచి లాయర్‌ను ఏర్పాటు చేస్తానని అంటుంది. మరోవైపు మధు ఫుల్లుగా తాగొచ్చి మురారికి నిజం చెప్పాలి అనుకుంటాడు. అలాగే తూగుతూ మురారి గదికి వెళ్లి సెల్ పట్టుకొని మురారి వేణి ఎవరు అని అడుగుతున్నావు కదా తను నీ భార్య అంటాడు. ఇంట్లో వాళ్లంతా అబద్ధం చెప్తున్నారు అని అంటాడు. ఇక ఆ మాటలు అన్నీ భవాని విని మధు చేతిలో ఫోన్ పగలగొట్టి.. మధు చెంప చెల్లుమనిపిస్తుంది.
ఇక మురారి రాత్రి ఒంటరిగా ఆరుబయటకు వచ్చి ఎందుకు వేణిగారు నాకు పదే పదే గుర్తొస్తున్నారు. ఎందుకు తనతో నాకు మాట్లాడాలి అనిపిస్తుంది. సభ్యతాసంస్కారం కాకపోయినా కాని నిత్యం వేణి గారిని చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అనుకుంటాడు. అప్పుడే అవుట్ హౌస్ దగ్గర కృష్ణ ఒంటరిగా కూర్చొడం చూసి ఏమైందా అనుకొని అక్కడికి వెళ్తాడు.
కృష్ణ: సార్ మీరేంటి ఇక్కడ. టాబ్లెట్స్ వేసుకున్నారా. నిద్రరావడం లేదా
మురారి: వచ్చింది కానీ నిన్నిలా ఒంటరిగా చూసిన తర్వాత టెన్షన్ వచ్చింది.. మీరేమో అందర్ని మీవారు అనుకుంటారు. కానీ అందరూ మిమల్ని కాదనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారు ఏమో.. ఇంకా ఏమీ ప్రాబ్లమ్ ఉండకూడదు అని కనుక్కుందాం అని అది కూడా మీకు ప్రాబ్లమ్ లేకపోతే నాతో చెప్పండి
కృష్ణ: మనసులో.. మీకు నేనెంటే ఇంత ఇష్టం అని తెలీక ఒకప్పుడు మీకు ఇష్టం ఉందో లేదో అని టైం అంతా వృథా చేసుకున్నా ఏసీపీ సార్. ఇప్పుడు మీరు గతం అంతా మర్చిపోయినా నా మెమోరీస్ మిమల్ని వెంటాడుతున్నాయని నాకు బాగా అర్థమైంది.
మురారి: ఏంటి ఆలోచిస్తున్నారు నాతో చెప్పకూడదా
కృష్ణ: నో సార్ అంత రహస్యాలు ఏమీ లేవు. (మనసులో) ఉన్నదంతా మీకు సర్జరీ ఎవరు చేశారు.. ఆ శవాన్ని ఎవరు పంపించారు అనే ఈ రెండే నాకు అంతుపట్టని విషయాలు.. అబ్బా సార్ రండి కూర్చొండి.. అయినా మెడిసిన్ వేస్తే నిద్ర రావాలి కదా
మురారి: మీకో విషయం చెప్పనా మిమల్ని కలవడానికి నాకు టైం, ప్లేస్ ఏదీ అవసరం లేదని నా మనసు చెప్తుంది. సారీ ఏం అనుకోవద్దు. నా మనసులో ఉన్న మాట చెప్పేశానంతే.
కృష్ణ: మనసులో మాట చెప్పాలి అంటే చాలా ధైర్యం ఉండాలి.. నాకు ఇదివరకు లేదు ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను
మురారి: నన్ను చూశా
ఇక ఇద్దరూ చాలా సేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మురారి అలానే కృష్ణ ఒడిలో పడుకుండిపోతాడు. కృష్ణ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మురారినీ చూస్తూ తాను అలాగే పడుకుండిపోతుంది. ఉదయం లేచి మురారి చూసి షాక్ అవుతాడు. సారీ చెప్తాడు. ఇక మురారి కృష్ణతో మిమల్ని ఓ విషయం అడగొచ్చాఅని అంటాడు దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.