SSC GD Constable: 26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - అర్హతలు, పూర్తి వివరాలివే

SSC Constable GD Notification: కేంద్ర భద్రత బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ, రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

SSC Constable GD Notification: కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 6174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 11025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్‌(SSB)లో 635 పోస్టులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,189 పోస్టులు, అస్సాం రైఫిల్స్(AR)లో 1,490 పోస్టులు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 296 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో పురుషులకు 23347 పోస్టులు, మహిళలకు 2799 పోస్టులు కేటాయించారు. 

Continues below advertisement

ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 24 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి, డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి.  కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  వచ్చేఏడాది(2024) ఫిబ్రవరి/మార్చిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 భారతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు. 

వివరాలు..

* మొత్తం ఖాళీల సంఖ్య: 26,146

పోస్టుల కేటాయింపు: యూఆర్-10,809, ఈడబ్ల్యూఎస్-3633, ఓబీసీ-5360, ఎస్టీ-2602, ఎస్సీ-3742.

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 6174 మెన్-5211, ఉమెన్-963
సీఐఎస్‌ఎఫ్‌ 11025 మెన్-9913, ఉమెన్-1112
సీఆర్‌పీఎఫ్‌ 3337 మెన్-3266, ఉమెన్-71
ఎస్‌ఎస్‌బీ 635 మెన్-593, ఉమెన్-42
ఐటీబీపీ 3189 మెన్-2694, ఉమెన్-495
ఏఆర్ 1490 మెన్-1448, ఉమెన్-42
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 296 మెన్-222, ఉమెన్-74
మొత్తం ఖాళీలు 26,146 26,146

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. 02.01.2001 - 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్-3 సంవత్సరాలు, అల్లర్లలో భాదిత కుటంబాలకు చెందిన అభ్యర్థులకు  5 - 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.

దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంటలిజెన్స్‌ & రీజనింగ్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవర్‌నెస్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24.11.2023.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 31.12.2023. (23:00)

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.01.2024 (23:00)

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.01.2024 - 06.01.2024 (23:00)

➥ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: ఫిబ్రవరి - మార్చి, 2024.

Notification

Online Application

ALSO READ:

'టెన్త్' అర్హతతో కేంద్రంలో కానిస్టేబుల్ కొలువులు - 75,768 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

Continues below advertisement