Brahmamudi Serial Promo: ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రారంభం నుంచీ ప్రేక్షకాదరణ పొందుతూ మంచి టీఆర్పీ రేటింగ్‌తో విజయవంతంగా దూసుకుపోతుంది. కూతుర్లని సంపన్నుల ఇంటికి కోడళ్లుగా చేయాలని తపన పడే తల్లి కథే ఇది. ఇందుకు ఆ తల్లి ఏం చేసింది? సంపన్నుల కుటుంబానికి కూతుర్లను కోడళ్లను చేస్తుందా లేదా అనే కాన్సెప్ట్‌తో భిన్నంగా ఈ సీరియల్ సాగుతోంది. అందుకే, ఇది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది.


ఇక ఈరోజు ఎపిసోడ్ లో కోడలు అబద్ధం చెప్పిందని రుద్రాణి ఇంట్లోంచి బయటికి పంపించేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అని తెలియటంతో ఆ ప్రెగ్నెంట్ కి నేను కారణం కాదు అని షాక్ ఇస్తాడు రాహుల్. రుద్రాణి కూడా ఎవరితో నువ్వు చేసిన పాపాన్ని నా కొడుక్కి అంట కట్టాలని చూస్తుంది అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది. ఆ మాటలకి కోపంతో ఊగిపోయిన స్వప్న భర్త చంప పగల కొడుతుంది నేను గొప్పగా బ్రతకాలనుకున్నాను గాని క్యారెక్టర్ లేకుండా బ్రతకాలనుకోలేదు. మీరు నా మీద నింద వేస్తున్నారు అని నిరూపించుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను.


అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను మీరు సిద్ధమేనా అంటూ గట్టిగా మాట్లాడుతుంది. కావ్య కూడా అక్కని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అప్పుడు సీతారామయ్య నిజా నిజాలు తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల మీద నిందలు వేయొద్దు. ఆ అమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతుంది అంటే అందులో కూడా నిజం ఉండి ఉంటుంది. నిజా నిజాలు తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


తర్వాత రుద్రాణి రాహుల్ ని తన గదికి తీసుకువెళ్లి చెంప పగలగొట్టి నానా చివాట్లు పెడుతుంది. ఇక ఇప్పుడు మనం ఏమి చేసే పరిస్థితి లేదు, ఇప్పుడు స్వప్నకి ఏం జరిగినా మనం అందరికీ తెలిసిపోతుంది అందుకే అది చెప్పింది తప్పు అని మనం నిరూపించే లాగా చేయాలి అప్పటివరకు స్వప్నతో ఎలాంటి గొడవ పడకు అని కొడుకుని హెచ్చరిస్తుంది.


నవంబరు 27న ఏం జరగనుందంటే..


శనివారం విడుదలై ‘బ్రహ్మముడి’ ప్రోమో ప్రకారం.. నవంబరు 27న సీరియల్‌లో ఇలా జరగనుంది. కావ్యాతో రాజ్ మాట్లాడుతూ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు అని అంటాడు. నిజా నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడానికి కూడా హద్దు ఉండాలి అంటుంది కావ్య. అగ్రి గురించి తెలిసిన మనిషే అయితే పెళ్లి అయిన తర్వాత ఆ అరుణ్‌తో పరిచయాన్ని రహస్యంగా ఉంచదు.


నేను చూశాను అరుణ్ ని కలవడం, కలిసి మాట్లాడటం అంటాడు రాజ్. ఆ నిజాన్ని నేను వెలికి తీస్తాను. ఆ నింద నిన్న మాత్రమే అని నిరూపిస్తాను. ఇది నేను మా అక్క కోసం మాత్రమే చేసే పోరాటం కాదు. ఒక స్త్రీ చాలా సులభంగా పరాయి మగవాడికి లొంగిపోతుంది అన్న మీలాంటి మగవారికి గుణపాఠం నేర్పటానికి కూడా అంటూ భర్తని హెచ్చరించినట్లుగా మాట్లాడుతుంది. మరి కావ్య నిజాన్ని నిరూపించగలదా, ఈ పోరాటంలో గెలవగలదా తెలియాలంటే వేచి చూడాల్సిందే.



ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆